సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Gopichand: యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీక‌ర‌ణ‌లో గోపీచంద్ సినిమా

ABN, Publish Date - Oct 26 , 2025 | 09:13 PM

మాచో స్టార్ గోపీచంద్ (Gopichand) నటిస్తున్న ప్రెస్టీజియస్ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #గోపీచంద్33 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Gopichand

మాచో స్టార్ గోపీచంద్ (Gopichand) నటిస్తున్న ప్రెస్టీజియస్ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #గోపీచంద్33 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విజనరీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy), Srinivasaa Chitturi, Pavan Kumar Presents)దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ పతాకంపై (Srinivasaa Silver Screen) శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంపై సినీ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

తాజాగా, ఈ చిత్రం ఒక భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్‌ని షూట్ చేస్తోంది. హీరో గోపీచంద్‌తో పాటు ప్రధాన తారాగణంపై వెంకట్ మాస్టర్ నేతృత్వంలో ఈ యాక్షన్ ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారు. సినిమాకే మెయిన్ హైలైట్‌గా నిలిచే ఈ యాక్షన్ ఎపిసోడ్, ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటివరకు నాలుగు షెడ్యూల్స్, 55 రోజుల షూటింగ్ పూర్తయినట్లు తెలిపారు.

ఇప్పటికే గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్, గ్లింప్స్ వీడియోకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. యోధుడి గెటప్‌లో కనిపించిన గోపీచంద్ తన పాత్రలోని తీవ్రతను, ఇంటెన్స్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.

విభిన్నమైన కథలతో, టెక్నికల్ వాల్యూస్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి, ఈ చిత్రంతో భారత చరిత్రలోని ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని వెండితెరపైకి తీసుకువస్తున్నారు. అద్భుతమైన ఎమోషన్స్, విజువల్ గ్రాండియర్‌తో ప్రేక్షకులకు ఒక మరపురాని అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ తన కెరీర్‌లో మునుపెన్నడూ చేయని డిఫరెంట్ రోల్‌లో కనిపించబోతున్నారు.

Updated Date - Oct 26 , 2025 | 09:13 PM