సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Globe Trotter Song: సంచారి .. సంచారి.. సాహసమే తన దారి.. శృతిహాసన్ అదరగొట్టేసింది

ABN, Publish Date - Nov 10 , 2025 | 07:39 PM

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli)ప్రమోషన్స్ లో దిగనంతవరకే.. ఒక్కసారి అడుగుపెట్టాడా ఎక్కడ చూసినా ఆయన సినిమా గురించే మాట్లాడుకోనేలా చేస్తాడు.

SSMB 29

Globe Trotter Song: దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli)ప్రమోషన్స్ లో దిగనంతవరకే.. ఒక్కసారి అడుగుపెట్టాడా ఎక్కడ చూసినా ఆయన సినిమా గురించే మాట్లాడుకోనేలా చేస్తాడు. ఇక రెండేళ్లుగా SSMB29 నుంచి ఒక్క అప్డేట్ అయినా ఇవ్వండి అని ఫ్యాన్స్ ఎంత బతిమాలినా జక్కన్న కరగలేదు. ఇప్పుడు సమయం వచ్చింది. ఇక ఒకరు అడగాల్సిన పని లేదు. ఒకదాని తరువాత ఒకటి అప్డేట్స్ తో ఉక్కిరి బిక్కిరి అడగకుండా చేసేస్తున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో SSMB29 తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే పృథ్వీరాజ్ కుంభా అనే పాత్రలో నటిస్తున్నట్లు పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఎప్పుడెప్పుడు ఈ గ్లోబ్ ట్రాటర్ టైటిల్ వస్తుందా.. ? ఆ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుందా.. ? అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఎట్టకేలకు నవంబర్ 15 న రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్ లోనే టైటిల్ తో పాటు మహేష్ బాబు లుక్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ ఈవెంట్ డేట్ వచ్చేలోపే జక్కన్న హైప్ తో అభిమానులను చంపేస్తున్నాడు. ఇప్పటికే కుంభా పోస్టర్ తో రచ్చ చేసిన జక్కన్న తాజాగా గ్లోబ్ ట్రాటర్ థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశాడు. MM కీరవాణి సంగీతం అందించిన ఈ ఆడియో సాంగ్ ను హీరోయిన్ శృతి హాసన్ ఆలపించడం మరింత విశేషంగా మారింది. గ్లోబ్ ట్రాటర్ అంటే ఏంటి..? సినిమాలో మహేష్ క్యారెక్టర్ ఏంటి అనేది లిరిక్స్ లో స్పష్టంగా తెలుస్తోంది. కాలాన్నే శాసిస్తూ ప్రతిరోజు పరుగేలే.. వేగాన్నే శ్వాసిస్తూ పెనుగాలే తిరిగేలే.. ఖండాలే దాటేస్తూ ఖగరాజై వాలే.. హీరో ఒక సంచారి అని చెప్పుకొచ్చారు. అసలు ఈ సాంగ్ కు శృతి హాసన్ వాయిస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే .. కీరవాణి మ్యూజిక్ తో అదరగొట్టేశాడు అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Priyanka Chopra: ఇక్కడే ఎందుకు ఉంటున్నానో ఆ రోజు తెలుస్తుంది 

Girija Oak: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గిరిజ ఓక్.. ఎవరీమె

Updated Date - Nov 10 , 2025 | 07:57 PM