Ramcharan: బ్రహ్మానందం.. ఇంట్లో రామ్ చరణ్ సందడి
ABN, Publish Date - Aug 11 , 2025 | 09:18 AM
లెజెండ్ కమెడియన్ బ్రహ్మానందంకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సడన్ సర్‌ఫ్రైజ్ ఇచ్చాడు.
లెజెండ్ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam)కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సడన్ సర్‌ఫ్రైజ్ ఇచ్చాడు. ఆదివారం రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన (upasana konidela)తో కలిసి బ్రహ్మానందం ఇంటిని సందర్శించి వారి కుటంబ సబ్యులతో కాసేపు కాలక్షేపం చేశారు.
అయితే బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్ద్‌కు ఇటీవలే బిడ్డ జన్మించడంతో హస్య బ్రహ్మ మరోమారు తాత అయ్యారు.
ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ (Ram Charan) దంపతులు ఆదివారం మధ్యాహ్నం బ్రహ్మనందం(Brahmanandam) ఇంటికి లంచ్‌కి వెళ్లి వారి ప్యామిలీతో సరదాగా గడిపారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఇంరెందుకు ఆలస్యం మీరూ ఆ చిత్రాలను చూసేయండి. బ్రహ్మనందం కుటంబానికి కంగ్రాట్యులేషన్స్ చెప్పండి.