సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Naga Durga: నాగ‌దుర్గ హీరోయిన్‌గా.. ‘కలివి వనం’! కొత్త పాట.. వ‌చ్చేసింది

ABN, Publish Date - Oct 26 , 2025 | 08:39 PM

తెలుగు జాన‌ప‌ద పాట‌ల సంచ‌ల‌నం నాగ‌దుర్గ (Naga Durga) క‌థానాయిక‌గా తెరకె క్కిన చిత్రం ‘కలివి వనం’.

Naga Durga

తెలుగు జాన‌ప‌ద పాట‌ల సంచ‌ల‌నం నాగ‌దుర్గ (Naga Durga) క‌థానాయిక‌గా తెరకె క్కిన చిత్రం ‘కలివి వనం’ (Kalivi Vanam). గ‌త కొంత కాలంగా జాన‌ప‌ద పాట‌ల‌తో రెండు తెలుగు రాష్ట్రాల‌లో అంత‌కుమించి అనే స్థాయిలో అభిమానుల‌ను, ఫాలోవ‌ర్స్‌ను సంఆదించుకున్న నాగ‌దుర్గ సినిమాల్లోకి అడుగు పెడుతోంది.

పూర్తిగా తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో వ‌స్తున్న సినిమాలో రఘుబాబు, సమ్మెట గాంధీ, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, విజయలక్ష్మీ కీలకపాత్రలు పోషించారు. రాజ్‌ నరేంద్ర దర్శకత్వంలో మల్లికార్జున్‌రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి నిర్మించారు.

వృక్షాలతో మనిషి అనుబంధాన్ని చర్చిస్తూ.. వనజీవి రామయ్య, దుశ్చర్ల సత్యనారాయణ స్ఫూర్తితో. అడవులను రక్షించుకోవాలని గొప్ప సందేశం ఇచ్చే కథతో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్ మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి గిరి గిరి అంటూ సాగే పాట‌ను విడుద‌ల చేశారు. తిరుప‌తి మ‌ట్ల (Thirupathi Matla) అందించిన సాహిత్యానికి మ‌దీన్ సంగీతం (Madeen Sk) అందించ‌గా అదితి భ‌వ‌రాజు (Aditi Bhavaraju) ఆల‌పించింది.

Updated Date - Oct 26 , 2025 | 08:39 PM