Champion: జంట బావుంది.. పాట అదిరింది! గిర‌గిర గింగిరాగిరే.. లిరిక‌ల్ వీడియో!

ABN , Publish Date - Nov 26 , 2025 | 10:21 AM

శ్రీకాంత్ కుమారుడు రోష‌న్ హీరోగా మ‌లి ప్ర‌య‌త్నంగా రూపొందుతున్న చిత్రం ఛాంపియ‌న్. ఈ మూవీ నుంచి తాజాగా గిర‌గిర గింగిరాగిరే (Gira Gira Gingiraagirey) అంటూ సాగే పాట‌ను విడుద‌ల చేశారు.

Champion

శ్రీకాంత్ (Srikanth) కుమారుడు రోష‌న్ (Roshan) హీరోగా మ‌లి ప్ర‌య‌త్నంగా రూపొందుతున్న చిత్రం ఛాంపియ‌న్ (Champion). స్వ‌ప్న సినిమా ( Swapna Cinema), ఆనంది ఆర్ట్స్ (Anandi Art Creations) బ్యాన‌ర్ల‌పై అశ్వినీ ద‌త్ కుమార్తె ప్రియాంక ద‌త్ (Priyanka Dutt), జెమిని కిర‌ణ్ (Gemini Kiran)లు ఈ చిత్రాన్ని నిర్మిస్తోండ‌గా మ‌ల‌యాళ బ్యూటీ అన‌శ్వ‌ర రాజన్ (Anaswara Rajan) తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతోంది. ప్ర‌దీప్ అద్వైతం (Pradeep Advaitham) ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇస్తూ క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ మూవీ క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌స్తోంది.

ఈనేప‌థ్యంలో ఇప్ప‌టికే రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌, గ్లిమ్స్ సినిమాపై మంచి అంచ‌నాలు తీసుకు రాగా తాజాగా ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ సింగిల్ గిర‌గిర గింగిరాగిరే (Gira Gira Gingiraagirey) అంటూ సాగే పాట‌ను విడుద‌ల చేశారు. ఈ పాట‌కు కాస‌ర్ల శ్యామ్ (Shyam Kasarla) సాహిత్యం అందించ‌గా మిక్కీ జే మేయ‌ర్ (Mickey J Meyer) సంగీతంలో మిర్యాల రామ్ (Ram Miriyala) ఆల‌పించాడు.

ఇక పాట విష‌యానికి వ‌స్తే.. వింటున్నంత సేపు పాట‌లోని కాలానికి వెళ్లిన‌ట్టుగా వారిన ప్ర‌త్య‌క్షంగా చూస్తున్నంత హాయిగా ఉంది. అంతేగాక రోష‌న్‌, అన‌శ్వ‌ర జంట క‌ల‌ర్‌ఫుల్‌గా, మెస్మ‌రైజింగ్‌గా క‌నుల‌కింపుగా క‌నిపించింది. సాహిత్యం, సంగీతం, గాత్రం దేనికదే ప్ర‌త్యేకంగా ఉండి చాలా రోజులు జ‌నం నోల్ల‌లో నానేలా ఉంది. ఇంకెందుకు ఆల‌స్యం మీరూ ఇప్పుడే విని ఆస్వాదించండి.

Updated Date - Nov 26 , 2025 | 10:21 AM