సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Annapurna- Ramanaidu: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు నోటీసులు

ABN, Publish Date - Nov 22 , 2025 | 11:14 AM

హైదరాబాద్‌లోని రెండు ఐకానిక్ స్టూడియోలు .. అన్నపూర్ణ , రామానాయుడు స్టూడియోస్‌కు GHMC షాక్ ఇచ్చింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజు పెద్ద మొత్తంలో బకాయిలు పడ్డాయని నోటీసులు జారీ చేసింది.

హైదరాబాద్‌లోని రెండు ఐకానిక్ స్టూడియోలు .. అన్నపూర్ణ , రామానాయుడు స్టూడియోస్‌కు GHMC షాక్ ఇచ్చింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజు పెద్ద మొత్తంలో బకాయిలు పడ్డాయని నోటీసులు జారీ చేసింది. అలాగే నిబంధనల కన్నా చాలా తక్కువ ఫీజు చెల్లించారని GHMC గుర్తించింది. టాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తెచ్చిన ఈ రెండు స్టూడియోలకు మంచి చరిత్ర ఉంది. 1975లో అన్నపూర్ణ స్టూడియో ఏర్పాటు కాగా .. సురేశ్ ప్రొడక్షన్స్ .. రామానాయుడు స్టూడియోస్ ను విస్తరించింది. ఈ రెండు కూడా ఫిల్మ్ స్కూల్స్ నడుపుతూ కొత్త తరాన్ని తయారు చేస్తున్నాయి. అయితే పెద్ద సంస్థలే ఇలా ఫీజు మినహాయింపు తీసుకుంటే చిన్న వ్యాపారులు ఏమనుకుంటారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అన్నపూర్ణ స్టూడియో రూ. 11.52 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 49 వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు తేలింది. అలాగే రూ. 1.92 లక్షలు చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియోస్ కేవలం రూ. 1900 మాత్రమే చెల్లిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ సర్కిల్ 18 అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు రెండు స్టూడియోలూ వివరణ ఇచ్చి బకాయిలు క్లియర్ చేయాల్సి ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Updated Date - Nov 22 , 2025 | 11:41 AM