సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Allu Arjun: అల్లు అర్జున్.. ఫ్యామిలీకి బ‌ల్దియా షాక్!

ABN, Publish Date - Sep 09 , 2025 | 10:11 AM

ఇటీవ‌ల త‌రుచూ వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తున్న అల్లు అర‌వింద్ (Allu Aravind) ఫ్యామిలీకి మ‌రో షాక్ త‌గిలింది.

Allu Arjun

ఇటీవ‌ల త‌రుచూ వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తున్న అల్లు అర‌వింద్ (Allu Aravind) ఫ్యామిలీకి మ‌రో షాక్ త‌గిలింది. ఇటీవ‌లే అర‌వింద్ అమ్మ గారు క‌న‌క ర‌త్న‌మ్మ (Kanakaratnamma), ఆపై ఆయ‌న చిర‌కాల మిత్రుడు నాగ‌రాజు (C. Nagaraju) మ‌ర‌ణాల‌తో తీవ్ర శోకంలో ఉన్న ఆయ‌న‌కు ఇప్పుడు జీహెచ్ఎంసీ (GHMC) నుంచి ఊహించ‌ని షాక్ త‌గిలింది.

జూబ్లీహిల్స్ జూబ్లీహిల్స్ లోని అల్లు బిజినెస్ పార్క్ (Allu Family's Business Park) భవనంపై అక్రమ నిర్మాణం చేశారని, ఎందుకు కూల్చవద్దో చెప్పాలంటూ బల్దియా నుంచి సర్కిల్ 18 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ షోకాజ్ నోటీస్ జారీ చేశారు.

ఏడాది క్రితం నిర్మాత అల్లు అరవింద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో సుమారు వెయ్యి గజాల స్థలంలో 'అల్లు బిజినెస్ పార్క్' పేరుతో ఒక భవనం నిర్మించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో నాలుగు అంతస్తుల నిర్మాణానికి ఆయన జీహెచ్‌ఎంసీ నుంచి అధికారికంగా అనుమతులు తీసుకున్నారు.

అయితే.. ఈ మ‌ధ్య‌నే నాలుగు అంతస్తుల భవనంపై ప‌ర్మీష‌న్స్ లేకుండా బ‌ల్దియా నిబంధ‌న‌ల‌కు ఇటీవ‌ల అదనంగా పెంట్ హౌస్ నిర్మించిన విష‌యం జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి రావడంతో వారు వెంట‌నే రెస్పాండ్ అయి ఆ పెంట్ హౌస్ అక్ర‌మంగా నిర్మించార‌ని దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని, త్వ‌ర‌లోనే చట్ట ప్రకారం ఆ ఆక్ర‌మ నిర్మాణం కూల్చివేతకు చర్యలు తీసుకోనున్న‌ట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Updated Date - Sep 09 , 2025 | 11:41 AM