సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Telangana Gaddar Film Awards 2024: ఘనంగా మొదలైన గద్దర్ అవార్డ్స్..  హాజరైన అల్లు అర్జున్, బాలకృష్ణ 

ABN, Publish Date - Jun 14 , 2025 | 08:44 PM

ఎట్టకేలకు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్(Telangana Gaddar Film Awards ) వేడుక మొదలైంది. ఎన్నో ఏళ్ల తరువాత  తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. 

Gaddar Awards

Telangana Gaddar Film Awards 2024: ఎట్టకేలకు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్(Telangana Gaddar Film Awards ) వేడుక మొదలైంది. ఎన్నో ఏళ్ల తరువాత  తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.  హైటెక్స్ లో ఈ వేడుక  అంగరంగ వైభవంగా మొదలైంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటరెడ్డి వెంకట రెడ్డి, FDC ఛైర్మెన్ దిల్ రాజు, FDC ఎండీ హరీశ్  కలిసి ఈ వేడుకను జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 

 సినీ సెలబ్రిటీలతో గద్దర్ అవార్డ్స్ వేదిక కళకళలాడుతుంది. మణిరత్నం, సుహాసిని, మురళీ మోహన్, జయసుధ, జయప్రద, అల్లు అర్జున్, నందమూరి బాలకృష్ణ, విజయ్ దేవరకొండ.. తదితరులు ఈ వేడుకలో మెరిశారు. ఇక తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటరెడ్డి వెంకట రెడ్డి, FDC ఛైర్మెన్ దిల్ రాజు  టెక్నీషియన్స్ కు అవార్డులను ప్రదానం చేయడమే కాకుండా వారికి రూ. 5 లక్షలు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

 

 

Updated Date - Jun 14 , 2025 | 08:44 PM