Vaibhavam: ఐఐఎంలో చదివి మెగాఫోన్ పట్టి...
ABN, Publish Date - May 20 , 2025 | 03:23 PM
ఐఐఎం చదివి సినిమా మీద ప్యాషన్ తో చిత్రసీమలోకి అడుగుపెట్టిన సాత్విక్ తెరకెక్కించిన తొలి చిత్రం 'వైభవం'. ఈ సినిమా ఇదే నెల 23న జనం ముందుకు రాబోతోంది.
ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM)లో చదువుకున్న సాత్విక్ (Sathvik) అనూహ్యంగా తెలుగు సినిమా దర్శకుడిగా మారాడు. తన కార్పొరేట్ ఆశయాలను సైతం పక్కనపెట్టి మెగాఫోన్ పట్టుకున్నాడు.
వివరాల్లోకి వెళితే... తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన సాత్విక్ ఐఐఎం విశాఖపట్నం నుండి పట్టభద్రుడయ్యాడు. చిన్నప్పటినుండి సినిమాల మీద ఉన్న ప్యాషన్ తో మంచి చిత్రాలని తెలుగు ప్రేక్షకులకి అందించాలని కలలు కన్నాడు. మేనేజ్మెంట్ లో తనకి ఉన్న నైపుణ్యాన్ని సినిమాల్లో ఉపయోగిస్తే చక్కటి ఫలితాలని అందుకోవచ్చని సాత్విక్ విశ్వసించాడు. ఈ క్రమంలో దర్శకుడిగా 'వైభవం' (Vaibhavam) అనే సినిమాను తెరకెక్కించాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రంతో రుత్విక్ (Ruthvik), ఇక్రా ఇద్రిసి (Iqra Idrisi) తో పాటు పలువురు కొత్త నటీనటులు పరిచయం కాబోతున్నారు. ఈ నెల 23న 'వైభవం' సినిమా విడుదల అవుతోంది. మరి దర్శకుడిగా తనదైన ముద్రను తెలుగు సినిమా రంగంపై వేయాలనుకుంటున్న సాత్విక్ కోరిక ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి.
Also Read: Hari Hara Veera Mallu: పవన్ మూవీకి పాటరాసిన కీరవాణి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి