Anil Ravipudi: చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి.. డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకూ
ABN, Publish Date - Dec 21 , 2025 | 06:57 PM
చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి.. డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, పవన్, మహేశ్, ప్రభాస్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ అంతి కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్నట్లు, రోడ్డు పక్కన సరదాగా టీ షాఫులో టీ తాగుతున్నట్లు, టిఫిన్లు చేస్తున్నట్లు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే! ఇ
చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి.. డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకూ
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, పవన్, మహేశ్, ప్రభాస్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ అంతి కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్నట్లు, రోడ్డు పక్కన సరదాగా టీ షాఫులో టీ తాగుతున్నట్లు, టిఫిన్లు చేస్తున్నట్లు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే! ఇప్పుడు అలాంటిదే ఓ వీడియో ఎక్స్‌లో వైరల్ అవుతుంది. దానిని పోస్ట్ చేసింది దర్శకుడు అనిల్ రావిపూడి. ఏఐ టెక్నాలజీని ఎవరు ఎలా వాడుకున్నా.. ఆయన మాత్రం తన సినిమా ప్రమోషన్‌కు బాగానే వాడేలా కనిపిస్తోంది. తాజాగా చిరంజీవితో ఓ వీడియో చేశారు. చిరు నటించిన కొన్ని సినిమాల్లోని ఆయా పాత్రలకు సంబంధించిన మేకప్‌లో ఉండగా సెట్ కలిసినట్టుగా ఏఐ వీడియో క్రియేట్ చేశారు.
ఒకప్పుడు టీవీ ముందు కూర్చొని, మెగాస్టార్ ఎంట్రీకి ఈలలు వేసిన చిన్నోడిన నేను...
ఆయన స్టెప్స్‌కి స్ర్కీన్ ముందు గంతులేసిన అభిమానిని..
కాలం గడిచింది..
కలలు పెద్దవి అయ్యాయి..
అవే కలలు నన్ను కెమెరా వెనుక నిలబెట్టాయి.
ఇప్పుడు నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి,
నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకూ
ట్రెండ్‌తోపాటు వెళ్తున్నా..
ఏఐని ఇలా పద్దతిగా కూడా వాడుకోవచ్చు’ అంటూ
ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోదిఇ.
చిరంజీవి, నయనతార జంటగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది.