సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mayasabha: స్నేహితులే రాజకీయ ప్రత్యర్థులు

ABN, Publish Date - Jul 13 , 2025 | 02:04 AM

ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో ‘ప్రస్థానం’ ఫేమ్‌ దేవా కట్టా, జయకిరణ్‌కుమార్‌ సంయుక్తంగా తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌ ‘మయసభ’. ‘రైజ్‌ ఆఫ్‌ ద టైటాన్స్‌’ ట్యాగ్‌లైన్‌...

ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో ‘ప్రస్థానం’ ఫేమ్‌ దేవా కట్టా, జయకిరణ్‌కుమార్‌ సంయుక్తంగా తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌ ‘మయసభ’. ‘రైజ్‌ ఆఫ్‌ ద టైటాన్స్‌’ ట్యాగ్‌లైన్‌. విజయ్‌కృష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మించారు. ఆగస్టు 7న ఓటీటీ వేదిక సోనీ లైవ్‌ ద్వారా అందుబాటులోకి రానుంది. తాజాగా, టీజర్‌ను విడుదల చేశారు. సంభాషణలు, ప్రధాన పాత్రధారుల మధ్య ఉన్న సంఘర్షణ, భావోద్వేగాలు ఆకట్టుకున్నాయి. ఇద్దరు స్నేహితులు కొన్ని పరిస్థితుల వల్ల రాజకీయ ప్రత్యర్థులుగా మారితే ఎలా ఉంటుందనేది కథాంశం. అయితే వీరిద్దరి పాత్రలు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిని పోలి ఉంటాయని సమాచారం.

Updated Date - Jul 13 , 2025 | 02:07 AM