సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Fish Venkat: ప్రభాస్ సాయం.. అంతా మోసం

ABN, Publish Date - Jul 05 , 2025 | 04:22 PM

టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) అనారోగ్యానికి గురైన విషయం తెల్సిందే. రెండు కిడ్నీలు పాడైపోవడంతో బోడుప్పల్ లోని ఆర్బీఎమ్ హాస్పిటల్ లో డయాలసిస్ చికిత్స జరుగుతుంది.

Fish Venkat

Fish Venkat: టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) అనారోగ్యానికి గురైన విషయం తెల్సిందే. రెండు కిడ్నీలు పాడైపోవడంతో బోడుప్పల్ లోని ఆర్బీఎమ్ హాస్పిటల్ లో డయాలసిస్ చికిత్స జరుగుతుంది. ప్రస్తుతం వెంటిలేటర్ పై విషమ పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పటివరకు ఇండస్ట్రీ నుంచి ఎవరు సాయం చేయలేదని కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. అయితే నిన్నటికి నిన్న ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి మీడియా ముందు తన తండ్రి కిడ్నీ ఆపరేషన్ కు ప్రభాస్ (Prabhas) సాయం చేస్తానని చెప్పినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ప్రభాస్ అసిస్టెంట్ అని ఒకరు కాల్ చేశారు. కిడ్నీ ఇచ్చేవారిని వెతుక్కోండి.. ఆపరేషన్ కు ఖర్చు అయ్యే రూ. 50 లక్షలు మేము చూసుకుంటాం అని చెప్పినట్లు తెలిపింది.


ఇక ప్రభాస్ సాయం చేస్తున్నాడు అని తెలియడంతో సోషల్ మీడియాలో ప్రభాస్ మంచి మనసు గురించి అందరూ గొప్పగా చెప్పుకొచ్చారు. అయితే అదంతా ఫేక్ అని, ప్రభాస్ అసిస్టెంట్ అని చెప్పి మోసం చేసినట్లు తాజాగా ఫిష్ వెంకట్ భార్య సువర్ణ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీ నుంచి తమకు ఎలాంటి సహాయం అందలేదని, ప్రభాస్ అసిస్టెంట్ కాల్ చేసాడు అని వస్తున్న వార్తలు అన్ని అవాస్తవమని తెలిపింది. ప్రభాస్ కు ఈ విషయం గురించి అసలు ఏమీ తెలియకపోవచ్చు అని, ఒకవేళ తెలిస్తే కచ్చితంగా ఆయన హెల్ప్ చేస్తాడని ఆమె చెప్పుకొచ్చింది.


ఇక కూతురు స్రవంతి మాట్లాడుతూ.. ' ప్రభాస్ పీఏ అంటూ ఒక వ్యక్తి కాల్ చేశాడు. కిడ్నీ డోనర్ దొరికాక చెప్పండి.. ఆపరేషన్ కు కావాల్సిన డబ్బు మేము చూసుకుంటాం అన్నాడు. నాన్న హెల్త్ గురించి మొత్తం చెప్పాను. ప్రభాస్ సార్ షూటింగ్ లో ఉన్నారు. తరువాత మాట్లాడతారు అని చెప్పాడు. ఆ తరువాత మేము ఆ నెంబర్ కు కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వడం లేదు. రెండు రోజుల నుంచి ఆ నెంబర్ కు కాల్ చేస్తూనే ఉన్నాం. ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఆయన నుంచి మాకు ఎలాంటి సాయం అందలేదు' అని క్లారిటీ ఇచ్చింది. అయితే ఇది ఎవరో కావాలనే చేశారని, ప్రభాస్ నేమ్ చెడగొట్టడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Updated Date - Jul 05 , 2025 | 04:22 PM