సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Fish Venkat: రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి.. దయ చేసి ఆదుకోండి.. 

ABN, Publish Date - Jul 02 , 2025 | 10:32 PM

ఎన్నో చిత్రాల్లో తనదైన శైలి హాస్యంతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు ఫిష్ వెంకట్ (Fish Venkat) ఆయన కొంతకాలంగా  పడటం వల్ల  దూరం అయ్యారు. వి.వి. వినాయక్ సినిమాల ద్వారా పాపులర్ అయినా అయన దాదాపు   నాలుగేళ్లుగా  కిడ్నీల సమస్యతో బాధ పడుతున్నారు

ఎన్నో చిత్రాల్లో తనదైన శైలి హాస్యంతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు ఫిష్ వెంకట్ (Fish Venkat) ఆయన కొంతకాలంగా  పడటం వల్ల  దూరం అయ్యారు. వి.వి. వినాయక్ సినిమాల ద్వారా పాపులర్ అయినా అయన దాదాపు   నాలుగేళ్లుగా  కిడ్నీల సమస్యతో బాధ పడుతున్నారు. తన  రెండు కిడ్నీలు దెబ్బతినడంతో డయాలసిస్ ద్వారా చికిత్స పొందుతున్నారు వెంకట్‌.   తన తండ్రి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని, దీనస్థితిలో ఉన్న తమను ఆదుకోవాలంటూ ఫిష్‌ వెంకట్‌ ( Comedian Fish Venkat) కుమార్తె స్రవంతి కోరుతున్నారు.  

ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రెండు‌ కిడ్నీలు మార్పిడి చేయాలని, ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉందని  వైద్యులు చెప్పినట్లు స్రవంతి తెలిపారు. వైద్య సేవలకి ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నాం అని  దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరుతున్నారు. ‘ఆది’, ‘దిల్‌’, నాయక్, ‘అత్తారింటికి దారేది’ వంటి హిట్‌ సినిమాల్లో వెంకట్‌ నటించారు.  గబ్బర్ సింగ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరగా కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమాలో కనిపించారు. అనారోగ్యం కారణంతో సినిమాలు తగ్గించేశారు.

Updated Date - Jul 02 , 2025 | 10:34 PM