Andhra King Thaluka: ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి.. మరో పాట! ఎప్పుడంటే
ABN, Publish Date - Nov 09 , 2025 | 09:37 PM
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా నుండి ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్ నవంబర్ 12న విడుదల కానుంది.
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న కొత్త సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Thaluka) ప్రస్తుతం భారీ అంచనాలను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్థాయి ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, ఈ చిత్రానికి యువ దర్శకుడు మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, టీజర్, పాటలు అన్నీ ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను సృష్టించాయి. ఇప్పుడు మేకర్స్ తాజాగా నాలుగో సింగిల్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ (First Day First Show) సాంగ్‌పై అప్‌డేట్ ఇచ్చారు. ఈ సాంగ్‌ను నవంబర్ 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రామ్ ఎనర్జీతో నిండిన సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ వంటి ప్రతిభావంతులైన నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ & మర్విన్ సంగీతం అందించాడు. ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డ ఈ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రం నవంబర్ 28న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.