సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Andhra King Taluka: ఫస్ట్ డే ఫస్ట్ షో.. డ్యాన్స్ తో పూనకాలు తెప్పించిన రామ్

ABN, Publish Date - Nov 12 , 2025 | 07:42 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni), భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) జంటగా మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా (Andhra King Taluka).

Andhra King Taluka

Andhra King Taluka: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni), భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) జంటగా మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా (Andhra King Taluka). మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక స్టార్ హీరోకు అభిమానిగా రామ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ప్రతి అభిమాని కథ అని మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు. అందుకు తగ్గట్టే సినిమా అంతా ఫ్యాన్స్.. వారి హడావిడినే కనిపిస్తుంది.

ఇప్పటికీ ఈ సినిమా నుంచి రిలీజైన మూడు సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మరో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ డే ఫస్ట్ షో అంటూ సాగే సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సాధారణంగా మన అభిమాన హీరో సినిమా రిలీజ్ రోజున థియేటర్ వద్ద అభిమానులు ఏ రేంజ్ లో రచ్చ చేస్తారో ఈ సాంగ్ లో చూపించారు. లిరిక్స్ లా కాకుండా సింగిల్ లైన్స్ ను తీసుకొని సాంగ్ లా కన్వర్ట్ చేశారు. అన్నకు మేమేరా ఫ్యాన్స్.. ఇప్పుడేస్తాము రా డ్యాన్స్. వచ్చిందిరా పిలుపు.. అన్నదేరా గెలుపు.. మావాడి గ్లామరూ.. పాపలకే ఫీవరూ. ఆల్ ఆఫ్ యూ సింగూ.. ఆంధ్రాకే కింగూ.. అంటూ సింగిల్ లైనర్స్ తో అదరగొట్టేశారు.

ఇక రామ్ డ్యాన్స్ గురించి చెప్పుకోవాలంటే థియేటర్ లో పూనకాలు కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. ట్యాగ్ లైన్ కు తగ్గుట్టూ ఆ ఎనర్జీ.. ఆ గ్రేస్ అదిరిపోయాయి. సాంగ్ ను కచ్చితంగా రామ్ డ్యాన్స్ కోసమైనా రీపీట్ లో చూస్తారు అని చెప్పొచ్చు. మాస్ స్టెప్స్ తో పిచ్చెక్కించాడు అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆంధ్రా కింగ్ తాలూకా నవంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Nov 12 , 2025 | 07:42 PM