Murali Mohan: డొక్కా సీతమ్మ ధన్యజీవి
ABN , Publish Date - Jun 25 , 2025 | 01:06 PM
సీనియర్ నటుడు మురళీమోహన్ తన పుట్టిన రోజు వేడుకలను 'డొక్కా సీతమ్మ' చిత్రం బృందం సమక్షంలో జరుపుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రధారులుగా వల్లూరి రాంబాబు, మట్టా శ్రీనివాస్ నిర్మాత నిర్మిస్తున్న సినిమా 'ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ'. ఈ సినిమాను టి.వి. రవి నారాయణ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరామెన్ కాగా, కార్తిక్ కోడకండ్ల సంగీతాన్ని అందించారు. గతంలో రిలీజ్ చేసిన మూవీ టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా మురళీ మోహన్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను, గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.
ఈ క్రమంలో మురళీమోహన్ మాట్లాడుతూ, 'నా పుట్టిన రోజుని ఎప్పుడూ కూడా ఆశ్రమాల్లో చేసుకుంటూ ఉంటాను. దివ్యాంగులు, వృద్దాశ్రమాలు, అనాథాశ్రమాల్లో సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటాను. ఈ రోజు కూడా అంధుల ఆశ్రమానికి వెళ్లాల్సి ఉంది. కానీ ఓ అరగంట వచ్చి వెళ్లండని ‘డొక్కా సీతమ్మ’ టీం పిలిచింది. అందుకే ఇలా వచ్చాను. చిన్న నిర్మాతలే అయినా నా బర్త్ డేను ఇలా సెలెబ్రేట్ చేస్తున్నందుకు థాంక్స్. డొక్కా సీతమ్మ ధన్యజీవి. కాటన్ దొర గారు సైతం డొక్కా సీతమ్మ గారిని పొగిడారు. సన్మానం చేస్తామని లండన్‌కు రమ్మని పిలిస్తే ఆమె వెళ్లలేదు. 'నేను అక్కడికి వస్తే ఇక్కడ వారి ఆకలి ఎవరు తీరుస్తారు?' అని డొక్కా సీతమ్మ గారు నిరాకరించారు. అలాంటి ఓ గొప్ప మనిషి మీద సినిమాను తీస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు. మురళీమోహన్ ప్రోత్సాహం కారణంగానే ఈ మూవీ ఇక్కడి వరకూ వచ్చిందని, ఆయన సహకారం ఎప్పటికీ మర్చిపోలేనని దర్శకుడు టీవీ రవి నారాయణ చెప్పారు.
రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ..‘డొక్కా సీతమ్మ గురించి మేం చదువుకునే రోజుల్లో చాలా విన్నాం. ఇక ఆమె కథతో సినిమా తీస్తున్నారని తెలియడంతో ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచీ ఆయన నాకు సపోర్ట్‌గానే నిలిచారు. ఇండస్ట్రీలో మంచితనం అంటే సూపర్ స్టార్ కృష్ణ, మురళీ మోహన్ పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. మా గురువు దాసరి గారు అయితే మురళీ అంటూ కొడుకుని పిలిచినట్టుగా ప్రేమగా పిలుస్తుండేవారు’ అని అన్నారు. త్వరలోనే తాను మురళీ మోహన్ గారితో ఓ సినిమా చేయబోతున్నానని శివ నాగు చెప్పారు. ఈ కార్యక్రమంలో దాసన్న, మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్, రామ సత్యనారాయణ, బెక్కెం వేణు, సాయి వెంకట్ తదితరులు పాల్గొని మురళీమోహన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Rajinikanth: మజ్దూర్ గా హిందీలో కూలీ...
Also Read: NTR Family: శ్రీకృష్ణ పాత్రతో రాజయోగం ఖాయం...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి