Baby film: ఒక తన్మయత్వంలో రచన చేశాను
ABN, Publish Date - Aug 03 , 2025 | 06:29 AM
‘బేబీ’ సినిమా స్ర్కిప్ట్ రాసేటప్పుడు ఒక తన్మయత్వంలో ఉండిపోయేవాణ్ణి. హీరో హీరోయిన్ల పాత్రల మానసిక స్థితిని, భావోద్వేగాలను నేను అనుభూతి చెందుతూ రాసేవాణ్ణి...
‘బేబీ’ సినిమా స్ర్కిప్ట్ రాసేటప్పుడు ఒక తన్మయత్వంలో ఉండిపోయేవాణ్ణి. హీరో హీరోయిన్ల పాత్రల మానసిక స్థితిని, భావోద్వేగాలను నేను అనుభూతి చెందుతూ రాసేవాణ్ణి. ప్రతి సన్నివేశానికి మెరుగులు దిద్దుతూ రెండేళ్లపాటు కష్టపడి ఈ సినిమా స్ర్కిప్ట్‌కు తుదిరూపు ఇచ్చాను. ఇప్పుడు ఈ చిత్రానికి ఉత్తమ స్ర్కీన్‌ప్లే రచయితగా నాకూ, ఉత్తమ నేపథ్య గాయకుడిగా పీవీఎన్‌ఎ్‌స రోహిత్‌కు జాతీయ పురస్కారం దక్కినందుకు ఆనందంగా ఉంది’ అని దర్శకుడు సాయిరాజేశ్ అన్నారు. జాతీయ పురస్కారాలకు ఎంపికైన సందర్భంగా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో చిత్రబృందం సాయిరాజేశ్‌ను, రోహిత్‌ను సత్కరించింది. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ ‘‘బేబీ’ సినిమాలో పాట పాడడానికి ముందు నా కెరీర్ చాలా డల్‌గా ఉంది. ఈ చిత్రంలో ‘ప్రేమిస్తున్నా’ పాటకు అవకాశం రాగానే, చావో రేవో అన్నట్లుగా సాధన చేశాను. ఇప్పుడు ఆ పాటకు జాతీయ పురస్కారం దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అన్నారు.