Ghup Chup Ganesha: విడుదలైన 'గప్ చుప్ గణేశా' ట్రైలర్
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:58 PM
వినాయక చవితి సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ సెక్రటరీ కె.ఎల్. దామోదర్ ప్రసాద్ 'గప్ చుప్ గణేశా' మూవీ ఫస్ట్ లుక్, ట్రైలర్ ను లాంచ్ చేశారు.
కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్ పై సూరి ఎస్ దర్శకత్వంలో కేఎస్ హేమ్రాజ్ ( KS Hemraj) నిర్మాతగా రోహన్, రిదా జంటగా నటిస్తున్న సినిమా 'గప్ చుప్ గణేశా' (Ghup Chup Ganesha). ఈ చిత్రానికి శ్రీతరుణ్ సంగీతాన్ని అందించగా అంగత్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. ఈ చిత్రంలో అంబటి శ్రీనివాస్, గడ్డం నవీన్, అశోక్ వర్ధన్, సోనాలి పాణిగ్రహి, కిషోర్ మారిశెట్టి తదితరులు కీలకపాత్రలో పోషించారు. వినాయక చవితి సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ సెక్రటరీ కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (K.L. Damodara Prasad) ఈ చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్ లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా దామోదర ప్రసాద్ మాట్లాడుతూ, 'ఈ మూవీ టైటిల్ 'గప్ చుప్ గణేశా' చాలా బాగుంది. ప్రేక్షకులకు చాలా క్యాచీ టైటిల్ ను చిత్ర బృందం అందించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా నా చేత ఫస్ట్ లుక్, టైలర్ లాంచ్ చేయించిన ఈ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్. గతంలో కూడా కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్ పై 'రిచ్చిగాడి పెళ్లి' అనే చిత్రం హేమ్రాజ్ దర్శకత్వంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు హేమ్రాజ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి చిన్న సినిమాలు మంచి విజయం సాధించాలని కోరుకుంటూ మరొకసారి ఈ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను' అన్నారు. చిత్ర నిర్మాత హేమ్రాజ్, దర్శకుడు సూరి, మూవీ ఫస్ట్ లుక్, ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ట్రైలర్ విషయానికి వస్తే... మొహమాటస్తుడైన వ్యక్తి తన ఉద్యోగాన్ని, తన జీవితంలో ఎదురైన ఇతర సంఘటనలను ఏ విధంగా ఎదుర్కొంటాడు, తనపై అధికారితో ఎలా మెసులుకుంటాడు అనేది తెలుపుతూ ఫన్నీగా సాగింది. అతి త్వరలో ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా ఈ సినిమాను జనం ముందుకు తీసుకెళతామని మేకర్స్ చెప్పారు.
Also Read: Kanya Kumari: కన్యాకుమారి మూవీ రివ్యూ
Also Read: Sundarakanda Review: నారా రోహిత్ 'సుందరకాండ' మెప్పించిందా!?