Film Celebs - Army: ధైౖర్యంగా ముందుకు సాగండి.. మీ వెంట మేమున్నామంటూ సినీతారలు

ABN , Publish Date - May 09 , 2025 | 12:17 PM

జమ్మూ ఎయిర్‌పోర్టుతో పాటు జైసల్మేర్‌ విమానాశ్రయం లక్ష్యంగా శత్రు దేశం పాక్‌ చేసిన దాడులను ఇండియన్‌ ఆర్మీ (indian Army) సమర్థంగా తిప్పికొట్టింది. దీంతో భారత ఆర్మీపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు

జమ్మూ ఎయిర్‌పోర్టుతో పాటు జైసల్మేర్‌ విమానాశ్రయం లక్ష్యంగా శత్రు దేశం పాక్‌ చేసిన దాడులను ఇండియన్‌ ఆర్మీ (indian Army) సమర్థంగా తిప్పికొట్టింది. దీంతో భారత ఆర్మీపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరింత ధైౖర్యంగా ముందుకు సాగండి.. మీ వెంట మేమున్నాంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ ఇండియన్‌ ఆర్మీకి సెల్యూట్‌ (salute to Army) చేస్తున్నారు. దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

జమ్మూలో ఉంటోన్న బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ (Anupam Kher) సోదరుడు చెప్పిన మాటలను ఆయన షేర్‌ చేశారు. అక్కడ దాడులు జరిగిన నేపథ్యంలో తన సోదరుడికి ఫోన్‌ చేసినట్లు ఆయన చెప్పారు. ‘‘భయ్యా.. మనం భారతదేశంలో ఉన్నాం. భారతీయులం. మన రక్షణసైన్యం, వైష్ణో మాతా మనల్ని కంటికిరెప్పలా కాపాడుకుంటారు. పాకిస్థాన్‌కు సంబంధించిన ఒక్క క్షిపణి కూడా మన భూమిని తాకనివ్వరు. భారత్‌ మాతాకీ జై’’ అని తన సోదరుడు చెప్పినట్లు అనుపమ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

శత్రు దేశం జమ్మూను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి
- కంగనా రనౌత్‌  (Kangana Ranaut)

భారతీయ సైన్యానికి మరింత శక్తి నివ్వాలని ప్రార్థిస్తున్నాను. మన రక్షణ దళాలని ధైౖర్యంగా సాగుతూ.. శత్రువుల గుండెల్లో భయాన్ని నింపాలి

- సాయిదుర్గతేజ్‌

ఈ హింసను వాళ్లు ప్రారంభించారు.. మనం ముగిస్తాం. భారత సాయుధ దళాల కోసం ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటాం

- మంచు విష్ణు

READ ALSO: Subham Review: సమంత నిర్మించిన 'శుభం' సినిమా ఎలా ఉందంటే..

#Single Movie : #సింగిల్ మూవీ రివ్యూ


Updated Date - May 09 , 2025 | 03:03 PM