సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Raviteja: ఎన్నాళ్లు ఈ రొట్ట కథలు.. రవితేజ

ABN, Publish Date - Aug 11 , 2025 | 05:12 PM

జనరేషన్ మారుతుంది. అందరూ ఒకలా ఆలోచించడం లేదు. హీరోలను నమ్మి సినిమాలు చూసే రోజులు పోయాయి. కథ నచ్చితేనే సినిమా చూస్తున్నారు.

Raviteja

Raviteja: జనరేషన్ మారుతుంది. అందరూ ఒకలా ఆలోచించడం లేదు. హీరోలను నమ్మి సినిమాలు చూసే రోజులు పోయాయి. కథ నచ్చితేనే సినిమా చూస్తున్నారు. లేకపోతే నిర్మొహమాటంగా బాలేదని చెప్పేస్తున్నారు. అందుకే హీరోలు వైవిధ్యాన్ని ఎంచుకుంటున్నారు. కొత్త కొత్త కథలను వెతికి పట్టుకొని ప్రేక్షకుల చేత సూపర్ అనిపించుకుంటున్నారు. కానీ, కొంతమంది మాత్రం అసలు మారడం లేదు. అవే రొట్ట కథలతో ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నారు. అలాంటి హీరోల్లో మాస్ మహారాజా రవితేజ(Raviteja) ఒకరు. ఆయన ఎనర్జీ, మాస్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


రవితేజ సినిమా వస్తుంది అంటే మినిమమ్ గ్యారెంటీ అని అనుకునేవారు ప్రేక్షకులు. కానీ, ఇప్పుడు అలా లేదు. రవితేజ ఎప్పుడు ఒకేలాంటి కథలను ఎంచుకోవడం మొదలుపెట్టాడు. హీరో.. పోలీస్, గొడవ, తన కన్నా చిన్న హీరోయిన్, రొమాన్స్, విలన్ తో కామెడీ, క్లైమాక్స్ అంతే సినిమా. గత కొన్నేళ్లుగా రవితేజ నుంచి వచ్చిన ప్రతి సినిమాలు మొత్తం ఇదే ఫార్మాట్. ఇక ఇప్పుడు మాస్ జాతరలో కూడా ఇదే కథ. నేడు రిలీజ్ చేసిన టీజర్ కూడా చాలా అంటే చాలా రొటీన్ గా ఉందని నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. రవితేజ నుంచి కొత్తదనం కోరుకోవడం తప్పేమో అనే అభిప్రాయానికి వచ్చినట్లు కామెంట్స్ పెడుతున్నారు.


ధమాకా తరువాత నుంచి మొన్నీమధ్య వచ్చిన మిస్టర్ బచ్చన్ వరకు రవితేజ సేమ్ కథలు. ఏదైనా కథలో కొత్తదనం ఉంటుంది అనుకున్న ప్రతిసారి ఫ్యాన్స్ మోసపోతూనే ఉన్నారు. మాస్ జాతర విషయంలో కొత్తగా ఏదైనా జరుగుతుంది అనుకున్నవారికి ఏది జరగలేదు అని టీజర్ ను బట్టి అర్థమైంది. సామజవరగమనా లాంటి కథను అందించిన భాను భోగవరపు.. అలాంటి కొత్త కథతో వస్తాడేమో అనుకుంటే.. ఎప్పుడు ఉండే రొటీన్ కథతో రావడం మాస్ మహారాజా ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేసింది.


ఇక ఇవన్నీ పక్కన పెడితే.. టీజర్ లో రవితెజ - శ్రీలీల మధ్య కెమిస్ట్రీ.. వేసుకుందామా ఏంటి అని రవితేజ అనే డైలాగ్ అస్సలు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వయస్సుకు తగ్గట్లు హీరోయిన్ ను పెట్టకపోయినా.. కనీసంలో కనీసం ఇలాంటి డైలాగ్స్ అయినా తగ్గించి ఉంటే బావుండేదని ఇంకా ఈ వయస్సులో లిప్ లాక్ లు, నడుము గిల్లడాలు.. ఇవన్నీ చూసేవారికి ఎబెట్టుగా ఉన్నాయని పెదవి విరుస్తున్నారు. మిస్టర్ బచ్చన్ సమయంలో భాగ్యశ్రీతో చేసిన రొమాన్స్ కే రవన్న చాలా విమర్శలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు మళ్లీ ఆ విమర్శలనే కొనితెచ్చుకుంటున్నాడు. ఇక మారవా రవన్న అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది.. కొత్త కథలు నీ దగ్గరకు రావడం లేదా.. ? ఏ కథ అయితే నాకెందుకు డబ్బులు వస్తే చాలు అనుకుంటున్నావా.. ? అంటూప్రశ్నిస్తున్నారు. ఇక నుంచి అయినా డిఫరెంట్ డిఫరెంట్ కథలు చెయ్ అన్నా అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఇప్పటికైనా రవితేజ అభిమానుల ఆక్రందనను ఆలకిస్తాడో లేదో చూడాలి.

Updated Date - Aug 11 , 2025 | 05:12 PM