సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mark: మార్క్ నుంచి.. అదిరిపోయే డ్యాన్స్ నంబ‌ర్‌

ABN, Publish Date - Dec 15 , 2025 | 10:42 PM

గ‌త సంవ‌త్స‌రం మ్యాక్స్ వంటి బారీ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత క‌న్న‌డ సూప‌ర్ స్టార్ కిచ్చా సుదీప్ న‌టిస్తోన్న నూత‌న చిత్రం మార్క్.

mark

గ‌త సంవ‌త్స‌రం మ్యాక్స్ వంటి బారీ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత క‌న్న‌డ సూప‌ర్ స్టార్ కిచ్చా సుదీప్ (Kichcha Sudeepa) న‌టిస్తోన్న నూత‌న చిత్రం మార్క్ (Mark). మ‌రోమారు ఔట్ అండ్ ఔట్ హై వోల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ఎదుట‌కు క‌న్న‌డ‌తో పాటు తెలుగులోనూ విడుద‌ల అవుతోంది.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌ సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెంచేసింది. ఈక్ర‌మంలో తాజాగా ఈ సినిమా నుంచి లై లై మ‌లైకా (Masth Malaika) అంటూ సాగే హుషారెత్తించే డ్యాన్స్ నెంబ‌ర్ లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ పాట‌కు రాంబాబు గోసాల (Rambabu Gosala) సాహిత్యం అందించ‌గా అజ‌నీస్ లోక్‌నాథ్ (Ajaneesh Loknath) సంగీతంలో అనిరుధ్ శాస్త్రి (Anirudha Sastry), హ‌ర్షిక దేవ్‌నాధ్ (Harshika Devanath) ఆల‌పించారు. సుదీప్, నిస్వికా నాయిడుల‌పై చిత్రీక‌రించారు. పాట వింటుంటే త్వ‌ర‌లోనే చార్ట్‌బ‌స్ట‌ర్స్ లో చేరే అవ‌కాశం ఉంది.

Updated Date - Dec 15 , 2025 | 10:42 PM