సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Hesham Abdul Wahab: తెలుగులో నేను సంత‌కం చేసిన.. తొలి చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్‌'

ABN, Publish Date - Nov 07 , 2025 | 08:25 AM

తెలుగులో నేను సంగీతం అందించేందుకు అంగీకరించిన తొలి చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ అని ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు హేషమ్ అబ్దుల్ వహబ్ అన్నారు.

ది గర్ల్ ఫ్రెండ్ (The Girlfriend) ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం. కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా మంచి సందేశం ఉన్న సినిమా ఇది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరి లోనూ ఓ అంతర్మథనం మొదలవుతుంది' అని సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహబ్ (Hesham Abdul Wahab) అన్నారు. రష్మిక మందన్న (Rashmika Mandanna) లీడ్ రోల్‌లో నటించగా, రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) తెరకెక్కించిన చిత్రమిది. నేడు విడుదలవుతోన్న సందర్భంగా హేషమ్ మీడియాతో ముచ్చటించారు

. 'తెలుగులో నేను సంగీతం అందించేందుకు అంగీకరించిన తొలి చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్‌'. ఈ సినిమా చిత్రీకరణలో జాప్యం వల్ల నేను వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా మారడంతో నేపథ్య సంగీతం కోసం ప్రశాంత్ విహారిని తీసుకున్నారు. అతను చాలా మంచి బీజీఎం ఇచ్చారు. ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలు ఉంటాయి.

ఇటీవలే విడుదల చేసిన 'నీదే నీదే కథా' అనే పాట కంపోజింగ్ కోసం ఎక్కువగా కష్టపడ్డాను. హీరో హీరోయిన్ల పాత్రల మధ్య ఉండే సంఘర్షణే ఈ సినిమాకు మంచి పాటలు చేసే స్ఫూర్తినిచ్చింది. రాహుల్ కోరిక మేరకు మన స్వరాలు, వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించాం. తమిళ, మలయాళ చిత్రాల కన్నా తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తున్నాను' అని చెప్పారు.

Updated Date - Nov 07 , 2025 | 08:25 AM