ఎంత ముద్దుగున్నావే.. నాయుడు గారి అమ్మాయితో చౌదరి గారి అబ్బాయి
ABN, Publish Date - Jul 06 , 2025 | 05:15 PM
అమర్ దీప్, సుప్రీత జంగటా నటిస్తోన్న చిత్రం చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి సినిమా నుంచి తాజాగా ఎంత ముద్దుగున్నావే అంటూ సాగే పాటను విడుదల చేశారు.
బిగ్‌బాస్ ఫేమ్ అమర్ దీప్ (Amardeep Chowdary), సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్, నటి సురేఖా వాణి కూతురు సుప్రీత (Supritha Naidu) కథానాయికగా తెరకెక్కిన చిత్రం చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి (Chowdary Gari AbbayiTho Naidu Gari Ammayi). హీరో హీరోయిన్ల ఒరిజినల్ క్యాస్ట్ ను సినిమా టైటిల్‌గా రూపొందిన ఈ చిత్రానికి మాల్యాద్రి రెడ్డి (Malyadri Reddy) దర్వకత్వం వహించారు.
దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా నుంచి హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ఎంత ముద్దుగున్నావే (Entha Mudhugunnave) అంటూ సాగే టీజ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు బండి సత్యం (Bandi Satyam) సాహిత్యం అందించగా రఘు కుంచె (Raghu Kunche) ఆలపించారు, కేవీజే దాస్ (K.VJ Das) సంగీతం అందించారు.