Tollywood: అడ్డంగా బుక్కయిన టాలీవుడ్ సెలబ్రిటీస్
ABN, Publish Date - Jul 10 , 2025 | 09:51 AM
ఫిల్మ్ అండ్ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ పై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలో వీరిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసినట్టు తెలుస్తోంది.
ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ (Betting apps) ను ప్రమోట్ చేసిన కారణంగా ఏకంగా 29 మంతి ఫిల్మ్ సెలబ్రిటీస్ (Film Celebrities), సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్, యూ ట్యూబర్స్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇ.సి.ఐ.ఆర్. ను ఫైల్ చేసింది. పబ్లిక్ గాంబ్లింగ్ యాక్ట్ 1867ను ధిక్కరించినందుకు వీరిని ఈ సెక్షన్ కింద బుక్ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలో వీరిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు.
పోలీసులు కేసు ఫైల్ చేసిన జాబితాలో విజయ దేవరకొండ మొదలు కొని ఎంతోమంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. జంగ్లీ రమ్మీ, ఎ 23, జీత్ విన్, పారి మ్యాచ్, లోటస్ 365 తదితర సంస్థలు వీరికి వాటిని ప్రమోట్ చేసినందుకు భారీ మొత్తాన్ని పారితోషికంగా ఇచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. వీరందరికీ త్వరలోనే సమన్లు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇందులో కొందరు తెలియక తప్పు చేశామని అంగీకరిస్తే, మరికొందరు తమ అగ్రిమెంట్ గడువు పూర్తి అయినా... తమ ప్రకటనలు సదరు సంస్థలు వాడుకున్నాయని వాపోయారు. మరికొందరు తాము ప్రచారం చేసిన బెట్టింగ్ యాప్స్ అధికారికమైనవేనని తెలిపారు. అయితే ఫణీంద్ర శర్మ, వినయ్ వంగల వంటి వారి నుండి వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఈ కేసును టేకప్ చేశారు. అలానే పులి కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఈ బెట్టింగ్ యాప్స్ ను నమ్మి తాను ఏకంగా మూడు కోట్ల రూపాయలను పోగొట్టుకున్నానని ఫిర్యాదు చేశాడు. వినోదం లేదా సామాజిక సేవ పేరుతో బెట్టింగ్ యాప్స్ ను నిర్వహించడాన్ని కూడా తప్పుపడుతూ ఎఫ్.ఐ.ఆర్. లో కేసు నమోదు చేశారు.
అందిన సమాచారం ప్రకారం వీరందరిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు అయినట్టుగా తెలుస్తోంది. అందులో రానా దగ్గుబాటి (Rana Daggubati), ప్రకాశ్ రాజ్ (Prakash Raj), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), మంచు లక్ష్మీ, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, సిరి హనుమంతు, శ్రీముఖి, వైష్ణవి సౌందర్ రాజన్, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణు ప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శేషయాని సుప్రీత, కిరణ్ గౌడ్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ అజయ్, సన్నీ, సుధీర్, యూ ట్యూబర్ లోకల్ బాయ్ నాని తో పాటు బెట్టింగ్ యాప్ మేనేజ్ మెంట్స్ పైనా ఎఫ్.ఐ.ఆర్. నమోదైందని సమాచారం.
Also Read: Thursday Tv Movies: గురువారం, జూలై10.. టీవీల్లో వచ్చే తెలుగు సినిమాలు