సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యే చిత్రమిది

ABN, Publish Date - Jun 19 , 2025 | 05:54 AM

అనంతిక సునీల్‌కుమార్‌ లీడ్‌రోల్‌ పోషించిన చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు. ఈనెల 20న విడుదలవుతున్న...

అనంతిక సునీల్‌కుమార్‌ లీడ్‌రోల్‌ పోషించిన చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు. ఈనెల 20న విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం ఇటీవలే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించింది. ఈ సందర్భంగా రవిశంకర్‌ మాట్లాడుతూ ‘సినిమా విజువల్‌గా చాలా బాగుంది. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యే చిత్రమిది. ఒక అమ్మాయి జీవిత ప్రయాణమే ‘8 వసంతాలు’ సినిమాగా మీ ముందుకొస్తోంది. తప్పకుండా మీకు నచ్చుతుంది’ అన్నారు. ‘ఇది చాలా డిఫరెంట్‌ మూవీ. కథ బాగా నచ్చి మేము చేసిన ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని నవీన్‌ యెర్నేని అన్నారు. ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ ‘మా నిర్మాతలు ఒక మంచి కథతో వస్తే సినిమా తీస్తారు అనే దానికి మా ‘8 వసంతాలు’ చిత్రం ఓ నిదర్శనం. ఈ సినిమాతో ఒక మంచి చిత్రాన్ని నిర్మించారనే పేరు వారికి వస్తుంది. అనంతిక నటన ఈ చిత్రానికి ప్రత్యేకాకర్షణ’ అని అన్నారు. అనంతిక మాట్లాడుతూ ‘మైత్రీ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలో సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. ఫణీంద్ర గారి వల్ల ఈ సినిమాలో ఒక బలమైన పాత్రను చేశాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం’ అన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 05:54 AM