Eesha: కావాలని.. నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు! ఎవరినీ వదలం
ABN , Publish Date - Dec 26 , 2025 | 06:12 AM
దయచేసి చిన్న సినిమాలను చంపకండి, సినిమానే నమ్ముకున్న వందలాది కుటుంబాలను రోడ్డున పడేయకండి అని విజ్ఞప్తి చేశారు ఈషా (Eesha) చిత్ర నిర్మాతలు.
దయచేసి చిన్న సినిమాలను చంపకండి, సినిమానే నమ్ముకున్న వందలాది కుటుంబాలను రోడ్డున పడేయకండి అని విజ్ఞప్తి చేశారు ఈషా (Eesha) చిత్ర నిర్మాతలు. ఈ చిత్రాన్ని మన్నె శ్రీనివాస్ (Srinivas Manne) తెరకెక్కించారు. కె.ఎల్.దామోదర ప్రసాద్ ( KL Damodar Prasad) సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. వంశీ నందిపాటి (Vamsi Nandipati), బన్నీ వాసు (Bunny Vas) విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంశీ నందిపాటి మాట్లాడుతూ 'విడుదలకు ముందు రోజు చాలా చోట్ల ప్రీమియర్ షోలు వేశాం. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆన్లైన్‌లో టికెట్ల బుకింగ్ కూడా ఆశా జనకంగానే ఉంది. అయితే సోషల్ మీడియాలో 'ఈషా' సినిమాపై జరుగుతోన్న వ్యతిరేక ప్రచారం మమ్మల్ని అసంతృప్తికి గురిచేస్తోంది. కొంత మంది కావాలని ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ ఫామ్లో ఫేక్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇలా చేయడం సరికాదు. సినిమా బాగుంటే ప్రేక్షకులు చూస్తారు, లేదంటే వదిలేస్తారు' అని అన్నారు.
కె.ఎల్.దామోదర ప్రసాద్ మాట్లాడుతూ ''ఈషా'తో పాటు మరికొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. మా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయినా మా సినిమాపై సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదు. దీని వెనుక ఎవరున్నా కనిపెడతాను' అని ఎదరినీ వదిలి పెట్టనని హెచ్చరించారు.
బన్నీ వాసు మాట్లాడుతూ ' సినిమాలకు రివ్యూలు రాయడం, విశ్లేషించడం సాధారణ విషయమే. కానీ, ఆన్‌లౌన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లపై రేటింగ్‌లను తగ్గిస్తున్నారు. కొన్ని వెబ్సైట్స్‌లో బూతులతో రివ్యూలు రాస్తున్నారు. 'ఈషా' సినిమాకు ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఈ సమయంలో ఇలాంటి నెగెటివ్ ప్రచారం సినిమాకు నష్టమే. సినిమాలను చంపేస్తున్న సోషల్ మీడియా నెగెటివ్ ప్రచారాలను నమ్మెదని ప్రేక్షకులను కోరుతున్నాం' అని అన్నారు.