సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood Upadates: దసరా వేళ.. సినిమా అప్‌డేట్ల కళ..

ABN, Publish Date - Oct 02 , 2025 | 12:54 PM

దసరా పండుగ సందర్భంగా సినిమా పరిశ్రమ కొత్తఅప్‌డేట్‌లతో కళకళలాడుతోంది. రాబోయే చిత్రాల పోస్టర్లు సందడి చేస్తున్నాయి.

దసరా పండుగ సందర్భంగా సినిమా పరిశ్రమ కొత్తఅప్‌డేట్‌లతో కళకళలాడుతోంది. రాబోయే చిత్రాల పోస్టర్లు సందడి చేస్తున్నాయి.

దసరా సందర్భంగా నందమూరి బాలకృష్ణ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ‘అఖండ 2’ అప్‌డేట్‌ ఇచ్చారు. డి?సెంబర్‌ 5న ‘అఖండ 2: తాండవం’ విడుదల కానున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్‌ విడుదల చేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు.


లేడీ మెగాస్టార్‌ నయనతార ప్రధాన పాత్రలో సుందర్‌.సి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మూకుతి అమ్మన్‌ 2’ తెలుగులో ‘మహాశక్తి’ పేరుతో రానున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

 

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా 'జటాధర' (Jatadhara). ఈ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీని వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ డైరెక్ట్ చేస్తున్నారు.  విజయ దశమి కానుకగా విడుదల తేదీని ప్రకటించారు,  నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం  ‘అరి’.  'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. జయశంకర్ దర్శకత్వంలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మిస్తున్నారు. ఈ నెల 10వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.    

 

‘రాజుగారి గది 4: శ్రీచక్రం’
ఓంకార్‌ దర్శకత్వంలో ‘రాజుగారి గది 4: శ్రీచక్రం’ చిత్రాన్ని ప్రకటించారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌. ఇప్పటికే ఈ సినిమా మూడు భాగాలుగా వచ్చింది. ఇప్పుడు నాలుగో చిత్రానికి శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది దసరాకు విడుదల కానున్నట్లు ప్రకటించారు.




‘సతీ లీలావతి’..

లావణ్యా త్రిపాఠి, దేవ్‌ మోహన్‌ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘సతీ లీలావతి’. సత్య తాతినేని దర్శకత్వంలో నాగ మోహన్‌ నిర్మిస్తున్నారు. దసరా శుభాకాంక్షలు చెబుతూ మేకర్స్‌ కొత్త పోస్టర్‌  విడుదల చేశారు.


శ్రీవిష్ణు హీరోగా రామ్‌ ‘సామజవరగమన’ చిత్రం రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు.

అల్లరి నరేశ్‌ హీరోగా శ్రీనివాస సిల్వర్‌ స్ర్కీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ‘12ఎ రైల్వే కాలనీ’. దసరా సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు.

 


Updated Date - Oct 02 , 2025 | 01:39 PM