Durandhar: గ్యాంగ్‌స్టర్ డ్రామా
ABN, Publish Date - Jul 07 , 2025 | 03:00 AM
రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘దురంధర్’. సంజయ్‌దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో...
రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘దురంధర్’. సంజయ్‌దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో సారా అర్జున్ కథానాయికగా బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. గతంలో పలు విజయవంతమైన చిత్రాలను అందించిన ఆదిత్య ధర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్, టీజర్‌ని చిత్రబృందం రిలీజ్ చేసింది. ట్రైలర్‌ని చూస్తే ఇదొక గ్యాంగ్‌స్టర్ డ్రామా అని అర్థమవుతోంది. ఇటీవల వచ్చిన ‘కిల్’, ‘జాన్ విక్’లను మించిన యాక్షన్ సన్నివేశాలు ఇందులో ఉన్నాయి.