సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Draupadi 2: దక్షిణ భారతదేశ వైభవాన్ని కళ్లకు కట్టినట్టుగా... 

ABN, Publish Date - Sep 24 , 2025 | 08:57 PM

రిచర్డ్ రిషి ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ద్రౌపది 2’. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తమిళ-తెలుగు భాషల్లో రాబోతోన్న ఈ సినిమాకి మోహన్.జి దర్శకత్వం వహిస్తున్నారు. 

రిచర్డ్ రిషి (Rishi) ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ద్రౌపది 2’ (Draupadi 2). హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తమిళ-తెలుగు భాషల్లో రాబోతోన్న ఈ సినిమాకి మోహన్.జి దర్శకత్వం వహిస్తున్నారు. జి.ఎం. ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి నేతాజీ ప్రొడక్షన్స్‌ బ్యానర్ మీద చోళ చక్రవర్తి నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది. 

దర్శకుడు మోహన్.జి మాట్లాడుతూ ‘ఇందులో ప్రేక్షకులను 14వ శతాబ్దంలోకి తీసుకు వెళ్లి, ఆనాటి దక్షిణ భారతదేశ వైభవాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించబోతున్నాం. దర్శకుడు ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా, చివరికి నిర్మాత సపోర్ట్, మద్దతుతోనే షూటింగ్‌ను పూర్తి చేయగలం. చిత్రీకరణమైన సమయంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా కూడా నిర్మాత చోళ చక్రవర్తి ఇచ్చిన సపోర్ట్‌తోనే చిత్రీకరణను పూర్తి చేయగలిగాను. ఆయనకు ఇది తొలి ప్రాజెక్ట్ అయినప్పటికీ, సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్, ఇష్టం, అనుభవం, కళ, విజన్‌ వల్లే ఇంత గ్రాండ్‌గా చిత్రీకరించగలిగాం. సృజనాత్మక స్వేచ్ఛను ఇవ్వడంతో ఈ మూవీని అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించానని అనుకుంటున్నాను’ అని అన్నారు.


నిర్మాత చోళ చక్రవర్తి మాట్లాడుతూ 'దర్శకుడు మోహన్ తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది.  షూటింగ్ అనుకున్న దానికంటే ముందే పూర్తయింది. నిర్మాతగా నాకు ఉండే ఎన్నో అనుమానాల్ని ఆయన నివృత్తి చేసిన విధానం నాకు నచ్చింది. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ తరహాలో మరిన్ని చిత్రాలను నిర్మించాలనే నా సంకల్పాన్ని బలోపేతం చేసింది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. డిసెంబర్‌లో నెలలో మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేతున్నాం’ అని అన్నారు. ఈ చిత్రంలో రక్షణ ఇందు సుదన్ కథానాయికగా నటించారు. నట్టి నటరాజ్, వై.జి. మహేంద్రన్, నాడోడిగల్ బరణి, శరవణ సుబ్బయ్య, వేల్ రామమూర్తి, సిరాజ్ జానీ, దినేష్ లాంబా, గణేష్ గౌరంగ్, దివి, దేవయాని శర్మ, అరుణోదయన్ కీలక పత్రాలు పోషించారు.  


 

Updated Date - Sep 24 , 2025 | 08:58 PM