సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bollywood Classic: డాన్‌ దర్శకుడు చంద్ర బారోట్‌ కన్నుమూత

ABN, Publish Date - Jul 21 , 2025 | 05:14 AM

అమితాబ్‌ బచ్చన్‌ కథానాయకుడిగా నటించిన బాలీవుడ్‌ క్లాసిక్‌ హిట్‌ ‘డాన్‌’ దర్శకుడు చంద్ర బారోట్‌ (86) కన్నుమూశారు. కొన్నాళ్లుగా...

అమితాబ్‌ బచ్చన్‌ కథానాయకుడిగా నటించిన బాలీవుడ్‌ క్లాసిక్‌ హిట్‌ ‘డాన్‌’ దర్శకుడు చంద్ర బారోట్‌ (86) కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మనోజ్‌ కుమార్‌ నటించి, నిర్మించిన పలు చిత్రాలకు చంద్ర సహాయ దర్శకుడిగా పనిచేశారు. ‘డాన్‌’ సినిమాను అద్భుతంగా తెరకెక్కించి, తొలి చిత్రంతోనే ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నారు. 1990లో ఆయన తెరకెక్కించిన బెంగాలీ చిత్రం ‘ఆశ్రిత’ ప్రేక్షకాధరణ పొందింది. తన సినిమా కెరీర్‌ సజావుగా సాగకపోవడంతో చంద్ర బారోట్‌ సినిమాల నుంచి వైదొలగి అడ్వర్టైజ్‌మెంట్‌ రంగంలో కొనసాగారు. ‘డాన్‌’ చిత్రం పలు భాషల్లో రీమేక్‌ అయింది. తెలుగులో ఎన్టీఆర్‌ హీరోగా ‘యుగంధర్‌’ పేరుతో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. అమితాబ్‌ సహా పలువురు బాలీవుడ్‌ తారలు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.

Updated Date - Jul 21 , 2025 | 05:14 AM