డొక్కా సీతమ్మ లాంటి చిత్రాలు విజయం సాధించాలి
ABN, Publish Date - Jun 26 , 2025 | 02:11 AM
‘డొక్కా సీతమ్మగారి మీద సినిమా తీయాలని చాలా మంది అనుకున్నారు. కాటన్ దొర సైతం ఆవిడను పొగిడారు. సన్మానం చేస్తామని లండన్‌కు రమ్మని పిలిస్తే ఆవిడ...
‘డొక్కా సీతమ్మగారి మీద సినిమా తీయాలని చాలా మంది అనుకున్నారు. కాటన్ దొర సైతం ఆవిడను పొగిడారు. సన్మానం చేస్తామని లండన్‌కు రమ్మని పిలిస్తే ఆవిడ వెళ్లలేదు. ‘నేను అక్కడికి వస్తే ఇక్కడి వారి ఆకలి ఎవరు తీరుస్తారు? అని సీతమ్మగారు అన్నారట. అటువంటి గొప్ప వ్యక్తి మీద సినిమా తీస్తుండడం ఆనందంగా ఉంది. ఇప్పుడంతా కమర్షియల్‌గా మారింది. ఇటువంటి తరుణంలో ఇలాంటి మంచి చిత్రం నిర్మించిన రాంబాబు, రవి నారాయణ అభినందనీయులు. ఇలాంటి చిత్రాలు విజయం సాధించాలి’ అన్నారు మురళీమోహన్. ఆయన, ఆమని ప్రధాన పాత్రలు పోషించిన ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ చిత్రం గ్లింప్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రవి నారాయణ్, సంగీత దర్శకుడు కార్తిక్, దర్శకుడు శివనాగు, రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.