Samantha: మరో వివాదంలో సమంత..
ABN, Publish Date - Jun 06 , 2025 | 01:07 PM
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Smantha)కు వివాదాలేమి కొత్త కాదు. ఎన్ని వివాదాల్లో ఇరుకున్నా.. విమర్శలు వచ్చినా ఆమె ఇలాంటివి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూనే ఉంటుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Smantha)కు వివాదాలేమి కొత్త కాదు. ఎన్ని వివాదాల్లో ఇరుకున్నా.. విమర్శలు వచ్చినా ఆమె ఇలాంటివి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూనే ఉంటుంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డ సామ్.. ఒక ఏడాది సినిమాలకు గ్యాప్ ఇచ్చి చికిత్స తీసుకుంది. ఇక గతేడాది నుంచే అమ్మడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపిస్తుంది.
మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడ్డాకా.. సామ్ ఆరోగ్యం గురించి ఒక పాడ్ కాస్ట్ ను నిర్వహించడం మొదలుపెట్టింది. ఈ పాడ్ కాస్ట్ లో హెల్తీ లైఫ్ ను అలవర్చుకోవడం ఎలా.. ? ఎలాంటి ఫుడ్ తినాలి.. ? ఏ వ్యాధికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి..? మెడిసిన్స్, డ్రగ్స్.. ఇలా ప్రతిదాని గురించి అనుభవజ్ఞులైన వైద్యులను తీసుకొచ్చి అవగాహన కల్పిస్తుంది. అయితే ఈ పాడ్ కాస్ట్ పై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. సామ్ చెప్పేవన్నీ ఫేక్ అని, ఆమె జనాలను మోసం చేస్తుందని డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్(Dr. Cyriac Abby Philips) ఆరోపించడం సంచలనంగా మారింది.
డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ అలియాస్ ది లివర్ డాక్టర్(The Liver Doc) గతంలో కూడా సామ్ పై విమర్శలు గుప్పించాడు. తాజాగా మరోసారి సామ్ చెప్పే మాటలను నమ్మొద్దని కోరాడు. ఇటీవలే సామ్.. NMN(నికోటినామైడ్ మోనోన్యూక్లియోటైడ్) సప్లిమెంటరీ బ్రాండ్ ను ప్రమోట్ చేసింది. ఈ సప్లిమెంటరీ వాడితే శరీరంలో NAD(నికోటినామైడ్ అడెనిన్ డైన్యూక్లియోటైడ్) స్థాయి పెరుగుతుందని, శరీరంలో శక్తి వస్తుందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఏకాగ్రత కూడా పెరుగుతుందని, వృద్ధాప్యం రాకుండా ఉండడానికి ఇది దివ్య ఔషధం అని తెలిపింది.
ఇక ఈ వీడియోపై ది లివర్ డాక్టర్ మండిపడ్డాడు. సమంత సైన్స్ తెలియని నటి అని విమర్శించాడు. ఏమి తెలియకుండా ఆమె సప్లమెంటరీలను ప్రమోట్ చేస్తుందని, ఈ సప్లమెంటరీ ఇండస్ట్రీ మొత్తం తప్పుడు సమాచారంతో నిండి ఉంటుందని, సమంత లాంటి ప్రముఖులు తమ ఎండార్స్‌మెంట్‌లలో మరింత బాధ్యతాయుతంగా ఉండాలని కోరాడు. " సమంత ఒక మోసపూరితమైన కంపెనీని ప్రమోట్ చేస్తుంది. నాడ్ అనేది శరీర జీవ క్రియకు ముఖ్యమైన కో ఎంజైమ్. NMN వాడితే శక్తి వస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఇదొక దివ్య ఔషధం అని చెప్పి మార్కెట్ లో అమ్ముతున్నారు. కానీ, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీని వలన శరీర శోషణంకు గురవుతుంది తప్ప బాడీలోని ప్రతి అవయవాలకు వెళ్తుందని అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇలాంటి ఆధారాలు లేని సప్లిమెంటరీలను వాడమని.. ఏమి తెలియని సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తూ మోసం చేస్తున్నారు. మీకు అంతగా వయస్సు కనిపించకుండా ఉండాలంటే.. మంచి వ్యాయామం చేయండి. ఆరోగ్యమైన ఫుడ్ తినండి. మందు, సిగరెట్ జోలికి వెళ్లకుండా నిద్రపోండి. ఇలాంటి పాముల్లాంటి బ్రాండ్ అంబాసిడర్లను నమ్మకండి. నిజమైన వైద్యుల మాట నమ్మండి" అని చెప్పుకొచ్చాడు. మరి ఈ విమర్శలపై సమంత ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.