Allu Family: అల్లు వారి ఇంట దివాళీ సంబురం.. కొత్త కోడలు రాక
ABN, Publish Date - Oct 20 , 2025 | 10:28 PM
దీపావళి (DIWALI) పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు అంబరాన్నంటేలా జరుపుకుంటున్నారు.
దీపావళి (DIWALI) పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు అంబరాన్నంటేలా జరుపుకుంటున్నారు. ఇక సెలబ్రిటీలు ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో కలిసి శోభాయమానంగా జరుపుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ తారలు ఈ సారి దివాళి పండుగను మరింత ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
ఇప్పటికే.. రెండు రోజుల క్రితం బండ్ల గణేశ్ తన ఇంట్లో దివాళి వేడుకలను అద్భుతంగా నిర్వహించి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఆపై తెలుగు ఇండస్ట్రీ మెయున్ ఫిల్లర్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, నాగార్జున ఫ్యామిలీలు అంతా కలిసి ఈ వేడుకను జరుపుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరిచి పోలేని ట్రీట్ ఇచ్చారు.
ఇదిలాఉంటే.. ఇక సాయంకాలం ఫ్యాన్స్ అందరినీ ఉత్సాహ పరుస్తూ తమ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ దీపాల పండుగకు మరింత శోభను తీసుకు వచ్చారు. ముఖ్యంగా అల్లు అరవింద్ (Allu Aravind) ఫ్యామిలీ అంతా ఒకే చోట కలిసి దిగిన హైలెట్‌గా నిలిచింది. ఇందులో అల్లు అర్జున్ (Allu Arjun), కొత్త పెళ్లికొడుకు అల్లు శిరిష్ ఇలా అంతా వారి వారి శ్రీమతులు, పిల్లలతో ఉండి చూడముచ్చటగా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.