సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vishwambhara - Vassista: కీరవాణి సలహాతోనే అలా.. స్పెషల్‌ సాంగ్‌పై క్లారిటీ

ABN, Publish Date - Jul 27 , 2025 | 03:38 PM

‘విశ్వంభర’లో ఓ స్పెషల్‌ సాంగ్‌కు మాత్రం భీమ్స్‌ స్వరాలు అందించారు. దీనిపై చర్చ నడుస్తోంది.  కీరవాణి ఇచ్చిన ట్యూన్‌ నచ్చకపోవడంతోనే భీమ్స్‌తో చేయించారిన టాక్‌ నడిచింది.  దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు 

Vishwambhara


చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ (Vassista) మల్లిడి తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). త్రిష కథానాయికగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యు.వి క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఎం.ఎం.కీరవాణి (MM Keeravani) సంగీత దర్శకుడు. అయితే ఇందులో ఓ స్పెషల్‌ సాంగ్‌కు మాత్రం భీమ్స్‌ స్వరాలు అందించారు. దీనిపై చర్చ నడుస్తోంది. కీరవాణి ఇచ్చిన ట్యూన్‌ నచ్చకపోవడంతోనే భీమ్స్‌తో చేయించారిన టాక్‌ నడిచింది. అది పూర్తిగా అవాస్తవమని దర్శకుడు వశిష్ట క్లారిటీ ఇచ్చారు. ‘పలు యూట్యూబ్‌ ఛానళ్లు ఆస్కార్‌’ వచ్చిన కీరవాణిని అవమానించారు’ అంటూ థంబ్‌నైల్స్‌ పెట్టి, ఎలాపడితే అలా రాతలు రాశాయి. ‘విశ్వంభర’లోని ప్రత్యేక గీతం చేయాల్సిన సమయానికి కీరవాణి.. ‘హరిహర వీరమల్లు’ ఆర్‌ఆర్‌తో బిజీగా ఉన్నారు. అందుకే ఆయనే ‘ఈ సాంగ్‌ని మరో మ్యూజిక్‌ డైరెక్టర్‌తో చేయిద్దాం’ అని సజెస్ట్‌ చేశారు. అదేంటి సర్‌ అని నేనంటే.. ‘ఇందులో తప్పేముంది? ఒక పాట ఒకరు రాేస్త.. మరో పాట వేరొకరు రాస్తారు. ఇదీ అంతే అని సింపుల్‌గా అన్నారు. నా తొలి సినిమా ‘బింబిసార’కి చిరంతన్‌ భట్‌తో కలిసి ఆయన వర్క్‌ చేశారు. ఈ విషయాన్నీ గుర్తు చేశారు. వర్క్‌ ఆగకూడదన్నది ఆయన ఉద్దేశం. ఈ విషయాన్ని చిరంజీవికీ ఆయనే చెప్పారు. అలా భీమ్స్‌ని ఎంపిక చేశాం. ఈ స్పెషల్‌ సాంగ్‌ చిరంజీవిగారు నటించిన చిత్రాలు ‘రిక్షావోడు’, ‘ముఠామేస్ర్తి’ చిత్రాల థీమ్‌ మ్యూజిక్‌ వినిపిస్తుందని కొందరు అంటున్నారు. అన్నయ్యలో ‘ఆట కావాలా పాట కావాలా’, ఖైదీ ‘రగులుతుంది మొగలిపొద వంటి సాంగ్‌ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అలాంటిదేమీ లేదు. ఇదొక ప్రెష్‌ సాంగ్‌’ అని అన్నారు.


ఆ సాంగ్‌లో చిరంజీవితో కలిసి బాలీవుడ్‌ బ్యూటీ మౌనీరాయ్‌ స్టెప్పులేశారు. ‘ముందు అనుష్క, బాలీవుడ్‌ హీరోయిన్లను అనుకుని తర్వాత త్రిషను సెలెక్ట్‌ చేసినట్టున్నారు?’ అని అడగ్గా.. దర్శకుడు అవునని సమాధానమిచ్చారు. సెప్టెంబర్‌ 25న విడుదల అన్నదానిపై ఆయన మాట్లాడుతూ ‘అదే డేట్‌లో ‘ఓజీ’, ‘అఖండ 2’ వస్తుంటే మా సినిమాని ఎందుకు రిలీజ్‌ చేయాలనుకుంటాం. మేం ఇంకా ఏ డేట్‌ అనుకోలేదు. పరిపూర్ణంగా సినిమా పూర్తయ్యాక, సీజీ వర్క్‌ అంతా సంతృప్తికరంగా అనిపించిన తర్వాతే సినిమా విడుదల చేసప్తాం. పండగకు చిరంజీవి సినిమా రావాలని నేను అనుకోను. ఆయన సినిమా ఎప్పుడొస్తే అప్పుడే పండగ అనుకుంటా’ అని అన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 03:44 PM