సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

RGV: 'శివ' పాప‌కు.. క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ

ABN, Publish Date - Nov 13 , 2025 | 08:09 AM

శివ (Shiva) సినిమా రీ రిలీజ్‌ సందర్భంగా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) అందులో నటించిన బాల నటి సుష్మ (Sushma)కి సారీ చెప్పారు.

RGV

శివ (Shiva) సినిమా రీ రిలీజ్‌ సందర్భంగా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) అందులో నటించిన బాల నటి సుష్మ (Sushma)కి సారీ చెప్పారు. సైకిల్‌ ఛేజ్‌ సీక్వెన్స్‌లో నటించిన ఆ అమ్మాయి ఇప్పుడెలా ఉందో తెలియజేస్తూ ఆమె ఫొటోను షేర్‌ చేశారు.

‘సుష్మ.. నువ్వు సాహసోపేతమైన సన్నివేశాల్లో నటించావు. ఆ రిస్కీ షాట్‌తో నువ్వు ఎంతగా భయపడ్డావో దర్శకుడిగా అప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. అంగీకరించు’ అని ఆమెకు విజ్ఞప్తి చేశారు.

ఇందులో హీరో నాగార్జున (Nagarjuna) అన్న కూతురి పాత్రలో సుష్మ నటించింది. సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాల్లో ఈ సన్నివేశం ఒకటిగా నిలిచింది. ఈ నెల 14న ‘శివ’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - Nov 13 , 2025 | 08:10 AM