Prasanth Varma: వరుస ప్రాజెక్ట్స్.. 100 కోట్ల అడ్వాన్స్.. నిజమేనా

ABN , Publish Date - Oct 31 , 2025 | 04:32 PM

కుర్ర డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) గురించి ఒక న్యూస్ ఉదయం నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Prasanth Varma

Prasanth Varma: కుర్ర డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) గురించి ఒక న్యూస్ ఉదయం నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అ! సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రశాంత్ వర్మ ఆ తరువాత జాంబీ రెడ్డితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. హనుమాన్ తరువాత ప్రశాంత్ వర్మ పనితనం చూసి.. ఆయనతో పనిచేయడానికి నిర్మాతలు క్యూ కట్టారు.

హనుమాన్ తరువాత ప్రశాంత్ వర్మ చేతిలో అరడజను సినిమాలకు పైగా ఉన్నాయి. జాంబీ రెడ్డి 2, జై హనుమాన్, అధీరా, మహాకాళి, ప్రభాస్ మూవీ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇందులో రణవీర్ సింగ్ తో ఒక సినిమా, మోక్షజ్ఞతో ఒక సినిమా ప్రకటించి ఆగిపోయాయి. వాటిని పక్కకు తీస్తే మిగతా సినిమాలను ప్రశాంత్ వర్మ ప్రకటించడమే కానీ, పూర్తిచేసింది లేదు.

ఇక తాజాగా ప్రశాంత్ వర్మపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. హనుమాన్ క్రేజ్ ను ఉపయోగించుకొని కుర్ర డైరెక్టర్ నిర్మాతల దగ్గర సినిమాలు చేస్తాను అని అడ్వాన్సులు తీసుకొని మోసం చేశాడట. ఆ అడ్వాన్సులు మొత్తం కలుపుకున్న 80 నుంచి 100 కోట్లు ఉంటాయని టాక్. ఇక డబ్బులు తీసుకొని సినిమా ఎప్పుడు చేస్తావ్ అంటే.. నేను డైరెక్ట్ చేయను కథలను అందిస్తాను.. కొత్తవాళ్లకు అవకాశం ఇస్తాను అని చెప్పుకొస్తున్నాడట.

అయితే నిర్మాతలు మాత్రం ప్రశాంత్ వర్మనే సినిమా చేయాలనీ, లేదంటే అడ్వాన్సులు వెనక్కి ఇవ్వమని పోరు పెడుతున్నట్లు సమాచారం. నిర్మాతలు అంటే చిన్న చితకా కాదట.. మైత్రీ దగ్గర నుంచి, డీవీవీ, గీత ఆర్ట్స్, సితార ఇలా అన్ని ఉన్నాయట. అంత డబ్బుతో ప్రశాంత్ వర్మ ఏం చేస్తున్నాడు అంటే.. హనుమాన్ హిట్ తరువాత హైదరాబాద్ లో ఒక స్థలం కొని స్టూడియో నిర్మాణానికి పునాది వేశాడు వర్మ. దానికి ముందే ఒక అద్భుతమైన ఆఫీస్ ను కూడా తెరిచాడు. ఇక ఈ డబ్బునంతా ఆ స్టూడియోకి పెడుతున్నట్లు టాక్.

ఇక ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మాత్రం.. తాము ఈ గొడవల్లో లేమని క్లారిటీ ఇచ్చింది. ప్రశాంత్ వర్మకు తామేమి అడ్వాన్స్ ఇవ్వలేదని, తమ మధ్య వ్యాపార ఒప్పందాలు లేవని స్పష్టం చేసింది. ఆరోపించే ముందు నిజానిజాలు తెలుసుకొని చేయమని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఈ ఆరోపణల్లో నిజమెంత అనేది తెలియాలంటే ప్రశాంత్ వర్మ నోరు విప్పాల్సిందే.

Trinadha Rao Nakkina: 'నేను రెడీ'కి.. మిక్కీ స్వరాలు

Peter Teaser: జెస్సీ మళ్లీ వచ్చింది.. ఉత్కంఠగా ‘పీటర్’ టీజర్

Updated Date - Oct 31 , 2025 | 04:39 PM