Tribandhari Barbarik: మంచి సందేశం ఇవ్వాలనుకుంటున్నా
ABN, Publish Date - Aug 24 , 2025 | 05:16 AM
‘ఈ సినిమాలో హీరో, విలన్ అంటూ ప్రత్యేకంగా ఉండరు. అన్ని పాత్రల్లో అన్ని కోణాలుంటాయి’ అని అన్నారు దర్శకుడు మోహన్ శ్రీవత్స. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమా ఈనెల 29న...
‘ఈ సినిమాలో హీరో, విలన్ అంటూ ప్రత్యేకంగా ఉండరు. అన్ని పాత్రల్లో అన్ని కోణాలుంటాయి’ అని అన్నారు దర్శకుడు మోహన్ శ్రీవత్స. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమా ఈనెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు. ‘మారుతి జానర్‌లో ఉండే సినిమా కాదిది. కానీ ఈ కథను పర్‌ఫెక్ట్‌గా నెరేట్ చేశాను. ‘అన్ని పాత్రల్లోనూ అంతర్గత సంఘర్షణ ఉంటుంది. తెలిసో తెలియకో అందరం తప్పులు చేస్తుంటాం. అన్ని రకాల భావోద్వేగాలను నియంత్రణలో పెట్టుకునే వాడు గొప్ప మనిషి అని చెప్పదల్చుకున్నాను’ అని అన్నారు.