Director Maruthi: ఎన్టీఆర్ ఫాన్స్ కి క్షమాపణలు చెప్పిన మారుతీ.. అసలేమైంది
ABN, Publish Date - Nov 24 , 2025 | 02:11 PM
స్టేజి మీద మాట్లాడేటప్పుడు సెలబ్రిటీలు ఆచితూచి మాట్లాడాలని ఎన్నిసార్లు చెప్పినా వారు మాత్రం మారడం లేదు. మైక్ ముందు ఉంది కదా అని ఏదో ఒకటి అనేస్తున్నారు.. ట్రోల్స్ కు గురవుతున్నారు.. మళ్లీ తిరిగి క్షమాపణలు కోరుతున్నారు
Director Maruthi: స్టేజి మీద మాట్లాడేటప్పుడు సెలబ్రిటీలు ఆచితూచి మాట్లాడాలని ఎన్నిసార్లు చెప్పినా వారు మాత్రం మారడం లేదు. మైక్ ముందు ఉంది కదా అని ఏదో ఒకటి అనేస్తున్నారు.. ట్రోల్స్ కు గురవుతున్నారు.. మళ్లీ తిరిగి క్షమాపణలు కోరుతున్నారు. తాజాగా డైరెక్టర్ మారుతీ.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ది రాజా సాబ్ (The Raja Saab) సినిమాకు మారుతీ (Maruthi)నే దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. రిలీజ్ డేట దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మారుతీ.. నిన్న రాజా సాబ్ నుంచి రెబల్ సాబ్ అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో మారుతీ.. ఎన్టీఆర్ ని అవమానించడంటూ ఫ్యాన్స్ రచ్చ చేయడం మొదలుపెట్టారు.
ఈ ఈవెంట్ లో మారుతీ మాట్లాడుతూ.. 'కాలర్ ఎగరేసుకుంటారు.. అట్లా చెప్పను. ఎందుకంటే అవ్వన్నీ ఆ కట్ అవుట్ ముందు చాలా చిన్నవి అయిపోతాయి. నేను ప్రస్తుతం రెబెల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా. ప్రభాస్ ఫోటో జేబులో ఉంటే చాలు ఎలాంటి డైరెక్టర్ అయిన టాప్ డైరెక్టర్ అయిపోతాడు' అంటూ చెప్పుకొచ్చాడు. వార్ 2 ఈవెంట్ లో ఎన్టీఆర్ ఇలానే కాలర్ ఎగరవేసి తమ సినిమా హిట్ అవుతుందని చెప్పాడు. ఇప్పుడుమారుతీ ఎన్టీఆర్ నే అన్నాడని, తమ హీరోని పొగడడంలో తప్పు లేదు కానీ, వేరే హీరోతో కంపేర్ చేయడం .. ఆ హీరోని అవమానించడమే అని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ విషయం పెద్దది కాకుండా మారుతీ ఆదిలోనే తుంచేశాడు. ఫ్యాన్స్ కి సారీ చెప్పి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాడు.
' ముందుగా నేను ప్రతి అభిమానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. ఎవరినీ బాధపెట్టడం లేదా అగౌరవపరచడం నా ఉద్దేశ్యం కాదు. కొన్నిసార్లు మాటల ప్రవాహంలో మనం అనుకున్న మాటలు అనుకున్నట్లు రాకపోవచ్చు. నేను అన్న మాటలు వేరే విధంగా అర్ధం చేసుకున్నందుకు నేను చింతిస్తున్నాను.ఎన్టీఆర్ గారి పట్ల మరియు ఆయన అభిమానులందరి పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. సినిమా పట్ల,మీ హీరో పట్ల మీరు చూపే ప్రేమకు నేను నిజంగా విలువ ఇస్తున్నాను. ఇది నేను ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదని మనస్పూర్తిగా చెప్తున్నాను. ఈ విషయాన్ని అభిమానులు అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఈ సారీని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంగీకరిస్తారా.. ? లేదా.. ? అనేది చూడాలి.