Basil joseph': శక్తిమాన్' సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు..
ABN, Publish Date - Jun 22 , 2025 | 06:05 PM
అల్లు అర్జున్ హీరోగా మలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్ ఓ భారీ చిత్రం తీయబోతున్నారంటూ చాలాకాలంగా వార్తలొస్తున్నాయి. శక్తిమాన్ (Saktiman) తరహాలో ఈ చిత్రం ఉండబోతుంది అంటూ అభిమానులు, నెటిజన్లు సోసల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ (Allu arjun) హీరోగా మలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్ (basil joseph) ఓ భారీ చిత్రం తీయబోతున్నారంటూ చాలాకాలంగా వార్తలొస్తున్నాయి. శక్తిమాన్ (Saktiman) తరహాలో ఈ చిత్రం ఉండబోతుంది అంటూ అభిమానులు, నెటిజన్లు సోసల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ కథనాలను ఉద్దేశించి దర్శకుడు బసిల్ జోసెఫ్ స్పందించారు. ఆ కథనాల్లో నిజం లేదని చెప్పారు. ‘శక్తిమాన్’ పూర్తిగా బాలీవుడ్ రణ్వీర్ సింగ్ చిత్రమన్నారు. ఆయనతోనే ఆ సినిమా ఉంటుందని తెలిపారు. 90ల జనరేషన్‌కు బాగా సుపరిచితమైన సీరియల్ ‘శక్తిమాన్’. నాటి ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన ఈ పాత్రతో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందించాలని ఎంతోకాలంగా బాలీవుడ్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని కోసం రణ్వీర్ సింగ్‌ను సంప్రదించినట్లు కొన్నాళ్ల క్రితం వార్తలొచ్చాయి. అయితే అది కార్యరూపం దాల్చలేదు. తాజా బసిల్ ఇచ్చిన ప్రకటనతో ఆ సినిమా రణ్‌వీర్‌తోనే ఉంటుందనే స్పష్టత వచ్చింది.
‘పుష్ప’తో భారీ విజయం అందుకుని ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ గెలుచుకున్న బన్నీ ఇప్పుడు సినిమాలపై మరింత ప్లాన్‌గా ముందుకెళ్తున్నారు. విభిన్నమైన కథలు ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కోలీవుడ్ దర్శకుడు అట్లీతో ఓ సినిమా ప్రారంభించారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. సమాంతర ప్రపంచం, పునర్జన్మల కాన్సెప్ట్‌తో ముడిపడిన సైన్ఫిక్షన్ కథ ఇదని చెబుతున్నారు. దీపికా పదుకొణె కథానాయిక. తదుపరి మలయాళ నటుడు, దర్శకుడు బసిల్ జోసెఫ్‌తోనూ ఓ సినిమా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే పలు చర్చలు జరిగాయని తెలిసింది.