సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anil Ravipudi: నా కెరీర్‌ బాగుండడానికి.. కారణమైన వారిలో సాయికుమార్ ఒకరు

ABN, Publish Date - Dec 23 , 2025 | 05:57 AM

నా తొలి చిత్రం ‘పటాస్‌’ సమయంలో సాయికుమార్‌ ఎంతో సహకారం అందించారు. ‘

Anil Ravipudi

‘ఆది ( Aadi) అద్భుతమైన నటుడు. ఎన్నో జానర్స్‌లో సినిమా చేశాడు. నా తొలి చిత్రం ‘పటాస్‌’ సమయంలో సాయికుమార్‌ ఎంతో సహకారం అందించారు. ‘శంబాల’తో ఆదికి సూపర్‌ హిట్‌ ఖాయం అని దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) అన్నారు. ఆది సాయికుమార్‌ ప్రధాన పాత్రలో యుగంధర్‌ ముని తెరకెక్కించిన మిస్టికల్‌ థ్రిల్లర్‌ ‘శంబాల’ (Shambhala). రాజశేఖర్‌ అన్నభిమోజు, మహీదర్‌ రెడ్డి నిర్మించారు. అర్చన అయ్యర్‌, స్వసిక, రవి వర్మ, మధునందన్‌ కీలక పాత్రలు పోషించారు.

ఈనెల 25న చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకకు అనిల్‌ రావిపూడితో పాటు హీరోలు కిరణ్‌ అబ్బవరం, మంచు మనోజ్‌, ప్రియదర్శి, నిర్మాతలు నవీన్‌ యెర్నేని, టీజీ విశ్వప్రసాద్‌ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ‘శంబాల’ చిత్రంపై మొదటి నుంచీ పాజిటవ్‌ వైబ్‌ ఉంది. నా కెరీర్‌ బాగుండడానికి కారణమైన వారిలో సాయికుమార్ (Sai Kumar) ఒకరు.

హిట్లు కొట్టడం ఒకెత్తయితే, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఒక ఎత్తు అని ఆది సాయుకుమార్‌ను చూస్తే అర్థమైంది. ఈ చిత్రంతో ఆయనకు సూపర్‌ హిట్‌ ఖాయం’ అని చెప్పారు కిరణ్‌ అబ్బవరం. ‘ఈ సినిమా కోసం ఆది చాలా కష్టపడ్డాడు. ‘శంబాల బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాలి’ అని మంచు మనోజ్‌ అన్నారు. ‘శంబాలతో ఆదికి చిత్రోత్సాహం.. నాకు పుత్రోత్సాహం.. టీమ్‌కు విజయోత్సాహం రావాలి’ అని సాయికుమార్‌ పేర్కొన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 05:57 AM