సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

TPL: స్టార్‌ క్రికెట‌ర్ల‌తో.. టాలీవుడ్ సెల‌బ్రిటీల టోర్నమెంట్

ABN, Publish Date - Dec 22 , 2025 | 06:46 AM

నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఆదివారం హైదరాబాద్‌లో ఓ కొత్త క్రికెట్ లీగ్‌ను ప్రారంభించారు.

tpl

నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఆదివారం హైదరాబాద్‌లో ఓ కొత్త క్రికెట్ లీగ్‌ను ప్రారంభించారు. టాలీవుడ్ ప్రో లీగ్ (Tollywood Pro League) (టీపీఎల్)గా పిలవబడే దీనికి ఈబీజీ (యూరోపియన్ బిజినెస్ గ్రూప్) సంస్థ యజమాని డా. ఇర్ఫాన్ ఖాన్ అధ్యక్షత వహించనున్నారు. దిల్ రాజు గౌరవ ఆధ్య క్షుడు. ఏటా రెండు సీజన్లతో ఆరు జట్ల ఫ్రాంచైజీ లీగ్ గా దీనిని నిర్వహించనున్నారు.

ఇందులో సెలబ్రిటీలు కూడా ఆటగాళ్లుగా సందడి చేయనున్నారు. ప్రముఖ నిర్మాతలు లీగ్ లోని టీమ్లకు యజమానులుగా ఉండ నున్నారు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ ఖాన్ మాట్లాడుతూ 'ఇది కేవలం క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదు, పరిశ్ర మలో ఐక్యతను బలోపేతం చేసే వేదిక అని అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ 'క్రీడలనూ, వినోద రంగాన్ని కలిపే లీగ్ ఇది' అని చెప్పారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్ర మానికి క్రికెటర్లు కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, రైనాతో పాటు నిర్మాత నాగవంశీ, దర్శకుడు అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు థమన్, రాశీఖన్నా తదితరులు అతి థులుగా విచ్చేశారు.

Updated Date - Dec 22 , 2025 | 06:46 AM