సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dil Raju: అరడజను సినిమాలు.. దిల్ రాజును ఏది గట్టెక్కిస్తుందో

ABN, Publish Date - Dec 01 , 2025 | 04:24 PM

శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations)' పతాకంపై దిల్ రాజు (Dil Raju), ఆయన సోదరుడు శిరీష్ కలసి పలు చిత్రాలు నిర్మించి తెలుగువారిని విశేషంగా అలరిస్తున్న విషయం తెల్సిందే.

Dil Raju

Dil Raju: 'శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations)' పతాకంపై దిల్ రాజు (Dil Raju), ఆయన సోదరుడు శిరీష్ కలసి పలు చిత్రాలు నిర్మించి తెలుగువారిని విశేషంగా అలరిస్తున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది 'శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్' పతాకంపై మొత్తం ఆరు చిత్రాలను అందించే ప్రయత్నంలో ఉన్నారు దిల్ రాజు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో 'రౌడీ జనార్దన్' ఒకటి.. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్(DSP) కథానాయకునిగా హాస్యనటుడు వేణు దర్శకత్వంలో 'ఎల్లమ్మ' చిత్రం త్వరలో మొదలు కానుంది. ఇక ఇవి కాకుండా పవన్ కళ్యాణ్ తోనూ ఓ చిత్రాన్ని నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు రాజు. ఆశిష్ హీరోగా 'దేత్తడి' అనే మూవీని తెరకెక్కించనున్నారు. ఇవి కాకుండా రెండు హిందీ చిత్రాలనూ ఇదే సంవత్సరం రూపొందించే దిశగా అడుగులు వేస్తున్నారు రాజు. అందులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా, అక్షయ్ కుమార్ తో 'సంక్రాంతికి వస్తున్నాం' రీమేక్ ఉన్నాయి.


ఒకే సంవత్సరంలో దిల్ రాజు ఆరు చిత్రాలు నిర్మించడం కొత్తేమీ కాదు. 2017లోనూ దిల్ రాజు బ్యానర్ నుండి ఆరు సినిమాలు జనం ముందు నిలచి సందడి చేశాయి. అప్పట్లో "శతమానంభవతి, నేను లోకల్, దువ్వాడ జగన్నాథమ్, ఫిదా, రాజా ద గ్రేట్, మిడిల్ క్లాస్ అబ్బాయి" మూవీస్ తో ప్రేక్షకులను భలేగా ఆకట్టుకున్నారు దిల్ రాజు. ఈ సారి కూడా అదే దూకుడు చూపించనున్నారు. అయితే అప్పటి కంటే ఇప్పుడు భారీ చిత్రాలతో పయనించడానికి సిద్ధం కావడం విశేషం. అప్పట్లో అన్నీ తెలుగు చిత్రాలే కాగా, ఈ సారి రెండు హిందీ సినిమాలు ఉండడం విశేషం!


తెలుగులో విజయం సాధించిన 'జెర్సీ'ని హిందీలో రీమేక్ చేస్తూ బాలీవుడ్ లో అడుగు పెట్టారు దిల్ రాజు. అల్లు అరవింద్, సూర్యదేవర నాగవంశీ, అమన్ గిల్ తో కలసి 'జెర్సీ' చిత్రాన్ని నిర్మించారు . ఆ తరువాత తెలుగులో సక్సెస్ చూసిన 'హిట్ - ద ఫస్ట్ కేస్'ను భూషణ్ కుమార్, కిషన్ కుమార్, కుల్దీప్ రాథోడ్ తో కలసి దిల్ రాజు తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు ఇతరులతో కలసి నిర్మించినవే. పైగా ఈ హిందీ చిత్రాలు పరాజయం పాలయయ్యాయి. అయితే ఈ సారి దిల్ రాజు తమ 'శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్' పతాకంపైనే రెండు హిందీ చిత్రాలను నిర్మిస్తూ ఉండడం విశేషం. అందునా ఓ సినిమాలో సల్మాన్ ఖాన్, మరో మూవీలో అక్షయ్ కుమార్ హీరోలుగా నటిస్తూ ఉండడం మరింత విశేషం. తెలుగులో నాలుగు, హిందీలో రెండు చిత్రాలను రూపొందిస్తున్న దిల్ రాజు 2026లో ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తారో చూడాలి.

Updated Date - Dec 01 , 2025 | 04:24 PM