సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రామ్‌చరణ్‌ను కించపరిచే ఉద్దేశం శిరీష్‌కు లేదు

ABN, Publish Date - Jul 03 , 2025 | 05:43 AM

శ్రీరామ్‌ వేణు మా సంస్థలోనే ఆర్యతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించి, అప్పటి నుంచి మాతోనే సినిమాలు చేస్తున్నాడు. మంచి థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం ఈ సినిమాను ఆయన డిజైన్‌ చేశారు....

శ్రీరామ్‌ వేణు మా సంస్థలోనే ఆర్యతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించి, అప్పటి నుంచి మాతోనే సినిమాలు చేస్తున్నాడు. మంచి థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం ఈ సినిమాను ఆయన డిజైన్‌ చేశారు. యాక్షన్‌ ఓరియంటెడ్‌ కంటెంట్‌ ఉన్న చిత్రమిది. 80 శాతం చిత్రీకరణ అడవిలో చేశాం. విజువల్స్‌ ప్రత్యేకాకర్షణగా ఉంటాయి. అక్కా తమ్ముళ్లు తమకు ఎదురైన సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారనేది కథ. సింపుల్‌ లైన్‌ అయినా స్ర్కీన్‌ప్లే పరంగా, యాక్షన్‌ పరంగా దర్శకుడు ఆసక్తికరంగా మలిచారు. నితిన్‌కు ఈ చిత్రంతో మంచి విజయం దక్కుతుందని నమ్ముతున్నాను.

‘గేమ్‌ఛేంజర్‌’ను పట్టుకుని వేళ్లాడుతున్నారు

జూ ‘తమ్ముడు’ సినిమా ప్రచార కార్యక్రమాలతో మేం తీరిక లేకుండా ఉంటే కొంతమంది ఆర్నెల్ల క్రితం విడుదలైన ‘గేమ్‌ఛేంజర్‌’ అపజయాన్ని పదే పదే తెరపైకి తెస్తున్నారు. రామ్‌చరణ్‌తో మాకు మంచి అనుబంధం ఉంది. ఆ సినిమాతో చరణ్‌కు హిట్‌ ఇవ్వలేకపోయాం. అందుకే మరో మంచి కథతో ఆయనతో సినిమా చేయబోతున్నాం. జనవరి తర్వాత విడుదలైన వాటిలో చాలా భారీ బడ్జెట్‌ సినిమాలు ఆడలేదు. వాటన్నింటినీ వదిలేసి ఒక్క ‘గేమ్‌ఛేంజర్‌’ను మాత్రమే పట్టుకుని వేళ్లాడుతున్నారు. ‘గేమ్‌ఛేంజర్‌’ ప్రస్తావన లేకుండా తమ్ముడు సినిమా ప్రచార కార్యక్రమాలు జరగడం లేదు.

  • జూ సినిమాను కాపాడడానికి ఎవరు ఏం చేసినా మేం కూడా అది అనుసరిస్తాం. ‘కన్నప్ప’ సినిమా విడుదలకు ముందు తప్పుడు సమీక్షలు, ట్రోలింగ్‌, పైరసీకి పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని విష్ణు చేసిన హెచ్చరికలు సత్ఫలితాలనిచ్చాయి. సినిమా విడుదలకు ముందు మేము కూడా ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు ఆలోచిస్తున్నాం.


దిల్‌రాజుకు పొగరు అంటున్నారు

జూ సినిమాకు మేలు చేయకపోయినా ఫరవాలేదు కానీ అబద్దపు రివ్యూలతో సినిమాకు హాని చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. దీనివల్ల నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. గట్టిగా నిలదీస్తే దిల్‌రాజుకు పొగరు అంటున్నారు. విడుదలకు ముందే ఫలానా ఓటీటీలో మా సినిమా రాబోతోంది అని ప్రకటించడం కూడా ఆపేస్తే థియేట్రికల్‌ రన్‌కు మేలు జరుగుతుంది.

  • పైరసీని అరికట్టేందుకు పరిశ్రమ తరపు నుంచి గట్టి చర్యలు తీసుకుంటున్నాం. థియేటర్స్‌లో పైరసీ చేస్తున్న కొందరినీ ఇటీవలే అరెస్ట్‌ చేశారు. ఇప్పుడు ప్రీమియర్స్‌కు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. అందుకే తమ్ముడు సినిమాకు ప్రీమియర్స్‌ వేసే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. హైదరాబాద్‌లో బాలల చిత్రోత్సవాల నిర్వహణ నిలిచిపోయింది. పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

‘నా సోదరుడు శిరీష్‌ను అనవసరంగా వివాదంలోకి లాగి ట్రోల్‌ చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలను తప్పుగా ఆపాదించారు. డిస్ట్రిబ్యూషన్‌ కోణంలో మాట్లాడారు తప్ప రామ్‌చరణ్‌ను కించపరిచే ఉద్దేశం శిరీ్‌షకు లేదు’ అని నిర్మాత, తెలంగాణ ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌రాజు అన్నారు. నితిన్‌ కథానాయకుడిగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘తమ్ముడు’ చిత్రం ఈ నెల 4న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దిల్‌రాజు మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 05:43 AM