సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dil Raju: 6 నెలలు కాదు, ఏడాదైనా.. అంతా అల్లు అర్జునే చూసుకుంటాడు

ABN, Publish Date - Dec 04 , 2025 | 07:59 PM

పుష్ప 2 సినిమా విడుద‌లై నేటికి ఏడాది పూర్తి చేసుకుంది. నాడు జ‌రిగిన సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట దుర్ఘ‌ట‌న‌, అనంత‌రం జ‌రిగిన ప‌రిణామాలు సృష్టించిన విష‌యం తెలిసిందే.

Allu Arjun

అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 (Pushpa 2) సినిమా విడుద‌లై నేటికి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ నేప‌థ్యంలో నాడు జ‌రిగిన సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట దుర్ఘ‌ట‌న‌, అనంత‌రం జ‌రిగిన ప‌రిణామాలు దేశ వ్యాప్తంగా సంచ‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో నాడు జ‌రిగిన ఘ‌ట‌న‌లో ఐదారు నెల‌లు కోమాలో ఉండి ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డిన శ్రీ తేజ్ (Sri Teja ) ప్ర‌స్తుత ప‌రిస్థితిని వివ‌రిస్తూ ఆంధ్ర‌జ్యోతి ఓ సంచ‌ల‌నాత్మ‌క స్టోరీని బ‌య‌టకు తీసుకువ‌చ్చింది. శ్రీతేజ్‌కు ఆరోగ్యం ఎలా ఉంది, ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుతుంది, ఎంత ఖ‌ర్చు అవుతుంది ఇంకా ఎలాంటి స‌హాకారం అవ‌స‌రం అనే ఇత్యాది అనేక అంశాల‌ను తెలియ‌జేశారు.

దీంతో ఈ వార్త‌ కాస్త బ‌న్నీ వాస్‌, దిల్ రాజు (Dil Raju) ల వ‌ర‌కు చేర‌డంతో వారు ఈ అంశంపై చ‌ర్చించి శ్రీతేజ్ తండ్రి భాస్క‌ర్‌ను పిలిపించి క్షేమ స‌మాచారాలు తెలుసుకున్నారు. ఆపై ఎలాంటి ట్రీట్‌మెంట్ జ‌రుగుతుంది అనే విష‌యాలు తెలుసుకుని శ్రీతేజ్ పూర్తిగా కోలుకునే వ‌ర‌కు ఖ‌ర్చంతా తామే భ‌రిస్తామ‌ని, మేం ఎక్క‌డా వ‌దిలి వేయ‌లేద‌ని, ఇప్ప‌టికే రూ. 2కోట్లు ఫిక్స్ డ్‌ డిపాజిట్ చేసి దానిపై వ‌చ్చే వ‌డ్డీ సైతం వారికే అందేలా చేశామ‌ని తెలిపారు. భ‌విష్య‌త్తులోనూ అల్లు ర్జున్ ఫ్యామిలీ నుంచి పూర్తి స‌హాకారం ఉంటుంద‌ని మీడియాలో వ‌చ్చే రూమ‌ర్స్‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని తెలిపారు.

Updated Date - Dec 04 , 2025 | 08:00 PM