సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Amaravathiki Aahwanam: ధ‌న్య‌, సుప్రీత నాయుడు.. ‘అమరావతికి ఆహ్వానం’ గ్లింప్స్‌

ABN, Publish Date - Dec 27 , 2025 | 08:37 AM

ప్రస్తుతం సినీ పరిశ్రమలో హారర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఏడాది విడుదలైన అనేక హారర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి.

Amaravathiki Aahwanam

ప్రస్తుతం సినీ పరిశ్రమలో హారర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఏడాది విడుదలైన అనేక హారర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. అదే ట్రెండ్‌లో ఉత్కంఠభరితమైన కథ, కథనంతో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనుభూతికి తీసుకెళ్లేలా రూపొందిన హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రం ‘అమరావతికి ఆహ్వానం’ (Amaravathiki Aahwanam). శివ కంఠంనేని (Siva Kantamneni), ధన్య బాలకృష్ణ (DhanyaBalakrishna), ఎస్తర్‌, సుప్రిత (Bandaru Sheshayani Supritha) ప్ర‌ధాన పాత్ర‌లు చేశారు. ప్రముఖ నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి నిర్మాణ సారథ్యంలో, జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై కేఎస్ శంకర్‌రావు, ఆర్. వెంకటేశ్వర రావు నిర్మించ‌గా

జీవీకే దర్శకత్వం వ‌హించాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లోని పలు లొకేషన్లలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌తో పాటు ఇతర నిర్మాణాంతర కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే భారీ స్థాయిలో ప్రమోషన్లు నిర్వహించి థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ శుక్ర‌వారం ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తే ధ‌న్య బాల‌కృష్ణ ఉగ్ర అవ‌తారంలో క‌నిపించి ఎవ‌రినో ప‌దే ప‌దే న‌రుకుతూ డైలాగులు చెబుతూ విడుద‌ల చేసిన వీడ‌యో కాస్త థ్రిల్లింగ్‌గా ఉంది.

ఈ సందర్భంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ.. మా సినిమా టైటిల్‌కు వచ్చిన రెస్పాన్స్ మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. మూడు రాష్ట్రాల్లో షూటింగ్ పూర్తి చేశాం. అద్భుతమైన కాస్టింగ్‌తో పాటు సీనియర్ నటులు మా సినిమాలో భాగమవడం ఆనందంగా ఉంది. దర్శకుడు జీవికే తన విజన్‌తో సినిమాకు మంచి అవుట్‌పుట్ తీసుకొచ్చారు. ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్ పనులు జరుగుతున్నాయి. థియేటర్లలో ప్రేక్షకులకు తప్పకుండా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనుభూతి కలుగుతుంది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.

అనంద‌రం దర్శకుడు జీవికే మాట్లాడుతూ.. ఇటీవల విడుదలైన హారర్ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అదే తరహాలో కానీ డిఫరెంట్ ట్రీట్మెంట్‌తో రూపొందిన హారర్ థ్రిల్లర్ ‘అమరావతికి ఆహ్వానం’. ప్రతీ పాత్రకు ప్రాముఖ్యత ఉండేలా కథను మలిచాం. జె. ప్రభాకర్ రెడ్డి విజువల్స్, హనుమాన్ ఫేమ్ సాయిబాబు తలారి ఎడిటింగ్ సినిమాకు బలంగా నిలుస్తాయి. పద్మనాబ్ బరద్వాజ్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను పూర్తిగా హారర్ మూడ్‌లోకి తీసుకెళ్తాయని తెలిపారు.

Updated Date - Dec 27 , 2025 | 09:07 AM