Kumari 21F: కుమారి 21 ఎఫ్ రీరిలీజ్ డేట్ వచ్చేసింది..

ABN , Publish Date - Jun 15 , 2025 | 08:33 PM

కుర్ర హీరో రాజ్ తరుణ్(Raj Tarun), హెబ్బా పటేల్(Hebah Patel) జంటగా నటించిన చిత్రం కుమారి 21ఎఫ్(Kumari 21 F).

Kumari 21F

Kumari 21 F: టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.  ఈ మధ్యకాలంలో  కొత్త సినిమాలు కన్నా పాత సినిమాల రీ రిలీజ్ లకే అభిమానులు భారీగా క్యూలు కడుతున్నారు. చిన్న హీరో, పెద్ద హీరో, కుర్ర హీరో, సీనియర్ హీరో అని తేడా లేకుండా హిట్ సినిమాలు అన్ని రీ రిలీజ్ లో చేస్తూ మేకర్స్ రికార్డులు సృష్టిస్తున్నారు. కొత్త సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో అన్న విషయం తెలియదు గానీ, పాత సినిమాలకు రిలీజ్ డేట్ లో కూడా ప్రకటిస్తున్నారు. 

 

తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన  ఒక లవ్ స్టోరీ రీ రిలీజ్ కు రెడీ అవుతుంది.  కుర్ర హీరో రాజ్ తరుణ్(Raj Tarun), హెబ్బా పటేల్(Hebah Patel) జంటగా నటించిన చిత్రం కుమారి 21ఎఫ్(Kumari 21 F). పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే తో పాటు సహ నిర్మాణం  కూడా చేసిన విషయం తెలిసిందే.  2015లో రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించింది.

 

Kantara Chapter 1: కాంతార సెట్ లో ప్రమాదం..  క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం 


 ఇప్పటివరకు ప్రతి సినిమా  క్లైమాక్స్ లో  హీరో విలన్స్ ను చంపడం చూసి ఉంటాము.. జైలుకు పంపడం చూసి ఉంటాము.  కానీ, ఈ సినిమాలో క్లైమాక్స్ ఈ రెండిటికీ విభిన్నంగా  ఉంటుంది. అప్పట్లో ఈ క్లైమాక్స్ గురించి చర్చ నడిచింది అంటే అతిశయోక్తి కాదు.  ముఖ్యంగా ఒక ఆడపిల్ల బోల్డ్ గా ఉన్నంత మాత్రాన క్యారెక్టర్ లూజ్ అయినట్లు కాదు అని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ తెలిపిన విధానం అభిమానులతో పాటు విమర్శకులు కూడా ఆకట్టుకుంది.

 

 హెబ్బా పటేల్ అందం, రాజ్ తరుణ్ అమాయకత్వం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. ఇందులోని కొన్ని డైలాగ్స్ సమాజం ఎలా మారింది అని చూపించేవిధంగా ఉంటాయి. చిన్న సినిమాగా రిలీజ్ అయిన కుమారి 21  ఎఫ్ భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు పదేళ్ల తరువాత  ఈ సినిమా రీరిలీజ్ కు రెడీ అయ్యింది. కుమారి 21 ఎఫ్ సినిమా జూలై 25 న  రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ ను బద్దలుకొట్టింది. మరి ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ రీపీట్ అవుతుందో లేదో చూడాలి. 

Updated Date - Jun 15 , 2025 | 08:33 PM