సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Trance of Kuberaa: ధ‌నుష్, నాగార్జున‌ ట్రాన్స్ ఆఫ్ కుబేరా.. టీజ‌ర్ అదిరింది!

ABN, Publish Date - May 25 , 2025 | 04:38 PM

ధ‌నుష్, నాగార్జున, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన చిత్రం కుబేర. ఆదివారం ఈ చిత్రం నుంచి ట్రాన్స్ ఆఫ్ కుబేరా అంటూ టీజ‌ర్ విడుద‌ల చేశారు.

kubera

ధ‌నుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna), ర‌ష్మిక (Rashmika) ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన చిత్రం కుబేర (Kubera). ల‌వ్‌స్టోరి వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రం త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల (Sekhar Kammula) త‌న స్టైల్‌కు భిన్నంగా తెర‌కెక్కిచాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన పాట‌, గ్లిమ్స్ సినిమాప మంచి అంచ‌నాల‌నే క్రియేట్ చేశాయి. జూన్ 20న ఈ చిత్రం థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈనేప‌థ్యంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆదివారం ఈ చిత్రం నుంచి ట్రాన్స్ ఆఫ్ కుబేరా (Trance of Kuberaa) అంటూ టీజ‌ర్ (Teaser) విడుద‌ల చేశారు.

సినిమా టీజ‌ర్ ప్రారంభ‌మే నాదే నాదే.. నేల‌ నాది.. గింజ నాది అంటూ ప‌వ‌ర్‌పుల్ పాట‌ బ్యాగ్రౌండ్‌లో ప్లే అవుతుండ‌గా సినిమా క‌థ‌ను దాదాపు చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అంతేకాదు ధ‌నుష్‌, నాగార్జున‌, ర‌ష్మిక, బాలీవుడ్ న‌టులు జిమ్ ష‌ర్బ్‌ (Jim Sarbh), ద‌లిప్ త‌హిల్ (Dalip Tahil) పాత్ర తీరుల‌ను చూయించి చాలా రోజులుగా ఈ మూవీ నుంచి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్ష‌కుల‌కు మంచి అదిరిపోయే ఫీల్ ఇచ్చారు. శేఖ‌ర్ క‌మ్ముల ఈ సారి కొత్త‌గా ఏదో చెప్ప‌బోతున్నాడ‌నేది అర్థ‌మ‌వుతోంది.శ్రీవేంక‌టేశ్వ‌ర సినిమాస్ (Sree Venkateswara Cinemas LLP), అమిగోస్ (Amigos Creations Pvt Ltd ) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ (Devi Sri Prasad) సంగీతం అందించాడు.

Updated Date - May 25 , 2025 | 04:39 PM