Dhanush: మొన్న మీనాతో పెళ్లి.. నేడు మృణాల్ తో ప్రేమ..
ABN , Publish Date - Aug 04 , 2025 | 08:03 PM
ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి సర్వ సాధారణం. ఒక హీరో, హీరోయిన్ కలిసి బయట కనిపిస్తే వారిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు పుట్టుకొచ్చేస్తాయి.
Dhanush: ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి సర్వ సాధారణం. ఒక హీరో, హీరోయిన్ కలిసి బయట కనిపిస్తే వారిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు పుట్టుకొచ్చేస్తాయి. అందులో ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువగా ఉండడంతో సినీ సెలబ్రిటీలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చూపొచ్చు. కానీ, కొందరు మాత్రం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వారిపై రూమర్స్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. అలాంటి హీరోల్లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ఒకడు. ఈమధ్యనే కుబేర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో.. ప్రస్తుతం తెలుగు, తమిళ్ హిందీ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా మారాడు.
ధనుష్ సినిమాల విషయం పక్కన పెడితే.. వ్యక్తిగతంగా అతనికి చాలామంది హీరోయిన్లతో ఎఫైర్ ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. రజినీకాంత్ కూతురు ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకన్నాడు. వీరికి ఇద్దరు మగపిల్లలు. ఇక ఈ జంట కొన్ని విభేదాల వలన 18 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. రజినీకాంత్ కుటుంబం ఎంతో ప్రాధేయపడినా కూడా వారు కలిసి ఉండడానికి ఒప్పుకోలేదని సమాచారం. ప్రస్తుతం ఐశ్వర్య ఒంటరిగా నివసిస్తుంది. ఇక ఈ విడాకుల తరువాత ధనుష్.. సీనియర్ నటి మీనాను పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి.
మీనా భర్త మరణించాకా.. ఆమె ధనుష్ ప్రేమలో పడిందని, వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూసింది. కానీ, మీనా మాత్రం ఈ వార్తలను ఖండించింది. ఇలాంటి వార్తల వలన తాను, తన కూతురు ఎంతో ఇబ్బందిపడుతున్నామని, అసలు ధనుష్ తనకు పరిచయం కూడా లేదని వాపోయింది. ఇక మీనాతో పెళ్లి రూమర్స్ తరువాత తాజాగా ధనుష్, అందాల భామ మృణాల్ ఠాకూర్ తో ప్రేమాయణం నడుపుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ధనుష్ - మృణాల్ ఈమధ్య ఎక్కువ కలిసి కనిపిస్తున్నారు. ఈమధ్య మృణాల్ బర్త్ డే వేడుకల్లో ధనుష్ నే సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా కనిపించాడు.
మృణాల్ బర్త్ డే వేడుకల్లో ధనుష్ తో ఆమె సన్నిహితంగా మెలగడం, చేతులు పట్టుకోవడం.. ఇద్దరూ లవర్స్ లా కనిపించడంతో వీరిద్దరి మధ్య డేటింగ్ వార్తలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. అంతేకాకుండా అసలు మృణాల్ కు సంబంధం లేని పార్టీలో ధనుష్ కోసమే అమ్మడు వెళ్లినట్లు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య ప్రేమ ముదిరిందని, త్వరలోనే వీరు ఓపెన్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. అయితే కెరీర్ ను చక్కగా మలుచుకుంటున్న మృణాల్.. జీవితంలో ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటుందా.. ? అంటే ఏమో ప్రేమ గుడ్డిది అంటారు కదా .. మరి అందులో మృణాల్ కూడా ఉందేమో చూడాలి.
Shootings Bandh: నచ్చిన కార్మికులతోనే షూటింగ్ అంటున్న ఛాంబర్
G2 Movie: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. గూఢచారి 2 రిలీజ్ డేట్ చెప్పారు