సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dhandoraa Trailer: కల్లు మత్తు కాదు.. కులం మత్తు.. దిగడానికి టైమ్ పడుతుంది

ABN, Publish Date - Dec 19 , 2025 | 08:32 PM

బిగ్ బాస్ తరువాత నటుడు శివాజీ (Shivaji) లైఫ్ మారిపోయింది. ఇక కోర్ట్ సినిమాతో ఆయన రేంజ్ మారిపోయింది. మంగపతి అంటే ఒక బ్రాండ్ అని చెప్పుకుంటున్నారు

Dhandoraa Trailer

Dhandoraa Trailer: బిగ్ బాస్ తరువాత నటుడు శివాజీ (Shivaji) లైఫ్ మారిపోయింది. ఇక కోర్ట్ సినిమాతో ఆయన రేంజ్ మారిపోయింది. మంగపతి అంటే ఒక బ్రాండ్ అని చెప్పుకుంటున్నారు అంటే ఆ పాత్ర ప్రేక్షకులకు ఎంత నచ్చిందో అర్ధమవుతుంది. ఇక శివాజీ సైతం ఆ రేంజ్ ను నిలబెట్టుకొనే పాత్రల్లోనే నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాడు. అందులో భాగంగా ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం దండోరా (Dhandoraa). నవదీప్ (Navadeep), నందు (Nandu), రవికృష్ణ (Ravikrishna), శివాజీ, బిందు మాధవి (Bindu Madhavi) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న దండోరా సినిమాకు మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాను రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించాడు.

ఇప్పటికే దండోరా చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా దండోరా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పల్లెటూర్లలో కులం మత్తులో ప్రజలు ఎలా అల్లాడుతున్నారో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారని ట్రైలర్ ని బట్టి అర్ధమవుతుంది.

శివాజీ గ్రామపెద్దగా కనిపించాడు. నందు ప్రేమించి పెళ్లి చేసుకోవడం వలన అతని వెలివేసినట్లు తెలుస్తోంది. నందు తండ్రి మరణించడంతో ఊరికి వచ్చిన అతను.. తన తండ్రి శవం కోసం పోరాడుతున్నట్లు చూపించారు. ఆ శవాన్ని కులపోళ్లు ఊర్లో తగలబెట్టకూడదని చెప్పడం.. ఊరి చివరకి తీసుకెళ్లి శవాన్ని వంతెన నుంచి కిందకు తోయడం లాంటి సీన్లు కంటతడి పెట్టిస్తాయి. ఇక నందు తండ్రి ఎవరు అనేది సస్పెన్స్ గా ఉంచారు. అయితే అది శివాజీనే అయ్యి ఉంటాడని నెటిజన్స్ అంటున్నారు.

ఇక శివాజీ ఊర్లో కులం కోసం ఎంతకైనా తెగిస్తాడు అని చివరి మాటలో అర్థమయ్యేలా చెప్పేశారు. కల్లు మత్తు అయితే త్వరగా దిగిపోద్ది.. కులం మత్తు కథ దిగడానికి మూడేళ్లు టైమ్ పట్టిందని కోర్టులో చెప్పడం హైలైట్ గా నిలిచింది. నవదీప్ సర్పంచ్ గా కనిపించగా.. బిందు వేశ్యగా దర్శనమిచ్చింది. ఇక ట్రైలర్ ని బట్టి ఈ సినిమాలో మంచి మెసేజ్ ని కూడా చూపించినట్లు తెలుస్తోంది. సినిమాకు శివాజీనే హైలైట్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా వీరందరికీ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Updated Date - Dec 19 , 2025 | 08:42 PM