Ruchi Gujjar: నడిరోడ్డుపై నిర్మాతను చెప్పుతో కొట్టిన హీరోయిన్

ABN , Publish Date - Jul 26 , 2025 | 05:09 PM

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ అంటే బాలీవుడ్ అనే చెప్పొచ్చు. అక్కడ నడిరోడ్డుపై కొట్టుకోవడం ఫ్యాషన్ గా మారింది.

Ruchi Gujjar

Ruchi Gujjar: వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ అంటే బాలీవుడ్ అనే చెప్పొచ్చు. అక్కడ నడిరోడ్డుపై కొట్టుకోవడం ఫ్యాషన్ గా మారింది. తాజాగా ఒక సీరియల్ నటి.. నడిరోడ్డుపైనే ఒక నిర్మాతను చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ నటి ఎవరు.. ? ఎందుకు అంతలా కొట్టింది.. ? అనేది తెలుసుకుందాం.


సీరియల్ నటి రుచి గజ్జర్. తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోయినా.. బాలీవుడ్ సీరియల్స్ చూసేవారికి ఆమె సుపరిచితురాలే. ఇక రుచి.. నిర్మాత కారం సింగ్ చౌహన్ అనే వ్యక్తికి రూ. 24 లక్షలు ఇచ్చింది. కరణ్.. ఒక కొత్త సీరియల్ నిర్మిస్తున్నానని, తనతో కలిసి సీరియల్ కు కో ప్రొడ్యూసర్ గా ఉండమని అడగడంతో ఆమె నమ్మి.. కరణ్ కి రూ. 24 లక్షలు ఇచ్చింది.


డబ్బులు తీసుకున్నాకా కరణ్ సీరియల్ స్టార్ట్ చేయకుండా ఆమెను తిప్పించడం మొదలుపెట్టాడు. ఇక దీంతో విసిగిపోయిన రుచి.. తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వమని కోరింది. తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకుండా కరణ్.. రుచిని బెదిరించడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇచ్చేది లేదని, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పుకొచ్చాడు. దీంతో రుచి.. అతడితో గొడవ పడుతున్న సమయంలోనే మాట మాట పెరిగి.. కోపంతో కడుపు రగిలి పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా అతడిపై చెప్పుతో దాడి చేసినట్లు తెలిపింది.


ప్రస్తుతం రుచి.. కరణ్ పై చెప్పుతో దాడి చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూశాకా.. రుచి వ్యాఖ్యలు విన్నాకా.. చాలామంది ఆమెకు సపోర్ట్ గా నిలబడుతున్నారు. అమ్మాయి అనేగా మోసం చేయాలనుకున్నాడు. అతనికి తగిన శాస్తి జరిగిందని, పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాలి అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Sobhan Babu: బ్లాంక్ చెక్ ఇచ్చినా మహేష్ కు తాతగా చేయను

Vijay Sethupathi: కాస్తంత ఆలస్యంగా తెలుగులో 'సార్.. మేడమ్'

Updated Date - Jul 26 , 2025 | 05:10 PM